అదే పాట.. చిరు-పవన్ సినిమా ఉంది

అదే పాట.. చిరు-పవన్ సినిమా ఉంది

మెగాస్టార్ చిరంజీవి-పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా తీయబోతున్నానని సీనియర్ నిర్మాత టి.సుబ్బిరామిరెడ్డి ప్రకటన చేసి ఏడాది దాటింది. కానీ దాని గురించి అతీ గతీ లేదు. ముందు ఈ ప్రకటనను జనాలు లైట్ తీసుకున్నా.. తర్వాత సుబ్బిరామిరెడ్డి ఒకటికి రెండుసార్లు ఈ విషయాన్ని నొక్కి వక్కాణించడం.. ఓ పెద్ద వేడుకలోనూ ఈ విషయాన్ని ఘనంగా ప్రకటించడంతో ఇది నిజమే అయ్యుండొచ్చేమో అన్న చర్చ జరిగింది. కానీ తర్వాతి పరిణామాలతో ఇది ఉత్తుత్తి న్యూసే అన్న అభిప్రాయం జనాల్లో బలపడిపోయింది. దీన్ని ఒక జోక్ లాగా తీసుకుంటున్నారు జనాలిప్పుడు.

కానీ సుబ్బిరామిరెడ్డి మాత్రం ఈ పాట వదలట్లేదు. ఎక్కడికి వెళ్లినా విలేకరులు కలిస్తే చిరు-పవన్ సినిమా ఉందనే అంటున్నారాయన. తాజాగా వరంగల్లో వేయి స్తంభాల గుడిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తాను తప్పకుండా చిరంజీవి-పవన్ కాంబినేషన్లో సినిమా నిర్మిస్తానని.. అందుకు సన్నాహాలు జరుగుతున్నాయని.. కథ సిద్ధం కాగానే ఈ సినిమా మొదలవుతుందని స్పష్టం చేశారు. కానీ ఆ కథ ఎవరు సిద్ధం చేస్తున్నారన్నది మాత్రం చెప్పలేదు. అసలు పవన్ కళ్యాణేమో ఇకపై సినిమాల్లో నటించేదే లేదంటున్నాడు. 2019 ఎన్నికల తర్వాతైనా పవన్ సినిమాల్లోకి పునరాగమనం చేస్తాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. పవన్ ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలే పక్కకు వెళ్లిపోయాయి. చిరు చూస్తే ‘సైరా నరసింహారెడ్డి’లో మునిగిపోయి ఉన్నాడు. కానీ సుబ్బిరామిరెడ్డి మాత్రం వెళ్లిన ప్రతిచోటా చిరు-పవన్ సినిమా అంటూ ఊదరగొట్టేస్తుండటం జనాలకు కామెడీగా అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు