మెగా మేనల్లుడు ఈ కాపీలు ఆపడా?

మెగా మేనల్లుడు ఈ కాపీలు ఆపడా?

సినిమాల్లో వారసుల హంగామా బాగానే ఉంటుంది. నెపోటిజం అంటూ నేషనల్ వైడ్ గా ఈ రచ్చ జరుగుతున్నా.. లాంఛ్ ప్యాడ్ తేలిగ్గా దొరకడం వీరికి సానుకూలం. అలాగే ఆయా వారసులు అరంగేట్రం కోసం తమ ఫ్యామిలీ హీరోలను ఉపయోగించుకున్నా.. ఆ తర్వాత తమదైన స్టైల్ ను చాటేందుకు ట్రై చేస్తారు. కానీ సుప్రీం హీరోగా గుర్తింపు పొందిన సాయిధరం తేజ్ స్టైల్ మాత్రం డిఫరెంట్ గా ఉంది.

ఆరంభం నుంచి అటు మెగాస్టార్ ను.. ఇటు పవర్ స్టార్ ను బాగా ఇమిటేట్ చేసేస్తున్నాడు. ఇప్పుడు ఇంటెలిజెంట్ అంటూ వివి వినాయక్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు తేజు. ఈ సినిమాలో మెగాస్టార్ మూవీ చమక్ చమక్ ఛాం ను రీమేక్ చేసిన సంగతి ముందే చెప్పేశారు. ఆ పాటలో కాస్ట్యూమ్స్ కూడా అలనాడు చిరంజీవి వేసినవే రిపీట్ చేశారు. ఇక స్టెప్స్ సంగతి చెప్పనే అక్కర్లేదు. గతంలో సుప్రీమ్ మూవీతో పాటు మరికొన్నింటిలోనూ ఇలాంటి పాటలు చూపించేశాడు. ఇక డైలాగ్ డెలివరీ అయితే అడగాల్సిన పని లేకుండా ఇమిటేట్ చేసి పారేస్తున్నాడు.

ఇలా ఎంతకాలం చిరంజీవినో.. పవన్ కళ్యాణ్ నో ఇమిటేట్ చేస్తాడన్నదే అర్ధం కాని విషయం. అదేమంటే.. అలా రీమిక్స్ కానీ.. ఇమిటేషన్స్ కానీ లేకుండా ట్రై చేస్తే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని సెంటిమెంట్ ఒకటి బైటకు తీస్తున్నారు. ఏదో ఒక కారణం చెప్పి ఈ కాపీ హంగామాలను మెగా మేనల్లుడు కొనసాగించేట్లుగానే ఉన్నాడు. వినాయక్ లాంటి బడా డైరెక్టర్ సినిమాలోనే కాపీలు చూపిస్తే..  తనదంటూ ప్రత్యేకమైన ఎప్పటికి బైటికి తీస్తాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English