మెగా మేనల్లుడి స్పీచ్ పేలిపోయిందిగా

మెగా మేనల్లుడి స్పీచ్ పేలిపోయిందిగా

వరుసగా నాలుగు వరుస ఫ్లాపులతో సంకట స్థితిలో ఉన్నాడు మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్. ఐతే ఆ ఫ్లాపుల తాలూకు నిరుత్సాహం ఏమీ అతడిలో కనిపించట్లేదు. తన కొత్త సినిమా ‘ఇంటిలిజెంట్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తేజు ఇచ్చిన ఎనర్జిటిక్ స్పీచ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఏం మొహమాట పడకుండా తనకు వరుసగా నాలుగు ఫ్లాపులు వచ్చాయని ఒప్పుకున్న తేజు.. తన ముగ్గురు మావయ్యల గురించి, వచ్చే వారాంతంలో బాక్సాఫీస్ దగ్గర తనతో తలపడబోతున్న వరుణ్ తేజ్ గురించి.. ఇంకా పవన్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అల్లు అర్జున్ గురించి కూడా మాట్లాడి ఆసక్తి రేకెత్తించాడు.

తనకు ఎన్ని ఫ్లాపులు వచ్చినా బాధ లేదని.. అభిమానుల్ని చూస్తే చాలు తనకు ఉత్సాహం, ఆనందం వస్తాయని చెప్పిన తేజ.. తన ముగ్గురు మావయ్యలూ తనకు గురువులని చెప్పాడు. వాళ్లే తనను తమ చేతుల్లో పెంచారని.. తాను ఈ స్థితిలో ఉండటానికి వాళ్లే కారణమని అన్నాడు. తన ముగ్గురు మావయ్యలతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల కోసం తాను ప్రాణాలివ్వడానికైనా సిద్ధమని తేజు ప్రకటించడం విశేషం.

మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన సామ్రాజ్యంలో మెగా జెండా ఎగురుతూ ఉండటానికి తాను ఏమైనా చేస్తానని, ఎంతైనా కష్టపడతానని అతనన్నాడు. ఇక తాను, వరుణ్ ఒకేసారి బాక్సాఫీస్ వార్‌కు దిగుతుండటం గురించి స్పందిస్తూ.. అందరూ అనుకుంటున్నట్లు తమ మధ్య పోటీ ఏమీ లేదని అన్నాడు. అసలు ఇద్దరం ఒకే రోజు వచ్చి హిట్లు కొడితే ఆ కిక్కే వేరుగా ఉండేదని.. ఆ ఛాన్స్ మెగా అభిమానులు మిస్సయిపోయారని.. అయినప్పటికీ ఒకే వీకెండ్లో తామిద్దరం వచ్చి హిట్లు కొట్టబోతున్నామని అతనన్నాడు.

వరుణ్‌ను తాను ఎంచుకుని పెంచానని, వాడు కూడా తనతో పాటే సక్సెస్ సాధిస్తే చూడాలని ఉందని.. ఇంకా మోహన్ బాబు సినిమా ‘గాయత్రి’ కూడా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తేజు చెప్పాడు. ‘ఖైదీ నంబర్ 150’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వినాయక్ తనతో సినిమా చేయడంతో తన అదృష్టమని అతనన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English