సైరా కోసం ఎకరం బట్టల కొట్టు

సైరా కోసం ఎకరం బట్టల కొట్టు

సినిమాకు కాస్ట్యూమ్స్ కీలకం. ముఖ్యంగా పీరియాడిక్ చిత్రాలకు అయితే ఇవి ప్రాణం పోసేస్తాయి. కథాకాలంను ప్రతిబింబిచడం కోసం.. మేకర్స్ చాలానే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఖైదీ నంబర్ 150తో 100 కోట్ల షేర్ వసూళ్లను సాధించి తన రేంజ్ చాటిన మెగాస్టార్.. ఇప్పుడు సైరా అంటూ సినిమా స్టార్ట్ చేసేశారు. 19వ శతాబ్దపు తొలి అర్ధభాగాన్ని ఈ చిత్రంలో కళ్లకు కట్టాల్సి ఉంటుంది.

ఇందుకోసం నటీనటుల కాస్ట్యూమ్స్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తాజాగా పద్మావత్ చిత్రానికి కాస్ట్యూమ్స్ అందించిన చంద్రకాత్ సొనావేన్.. సైరాకు కూడా వర్క్ చేస్తున్నారు. ఈ పనిలో మెగాస్టార్ పెద్ద కూతురు సుశ్మిత కూడా భాగం అయింది. అయితే.. భారీ తారాగణంతో రూపొందే ఈ చిత్రానికి.. డ్రెస్సుల విషయంలో అత్యంత శ్రద్ధ పాటిస్తున్నారు. బడ్జెట్ లో మేజర్ పోర్షన్.. ఇందుకే ఖర్చు కానుందట. ఇవి అన్నీ పదిలంగా ఉండేలా చర్యలు చేపట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇప్పటికే ఒక ఎకరం స్థలం తీసుకుని మరీ.. స్పెషల్ గా కాస్ట్యూమ్ షాప్ ఏర్పాటు చేశారట.

ప్రతీ ఒక్కరి కాస్ట్యూమ్స్.. ఆయా షెడ్యూల్ కు అనుగుణంగా ఈ కాస్ట్యూమ్ షాప్ లో అమర్చి ఉంచుతారట. ఇప్పటికే డిజైనింగ్ పూర్తయి.. సిద్ధమైన వాటిని ఈ కాస్ట్యూమ్ షాప్ కు తరలిస్తారట. కేవలం కాస్ట్యూమ్స్ కోసమే ఎకరం స్థలాన్ని కేటాయించి.. ఓ పెద్ద మాల్ మాదిరిగా నిర్వహించాల్సి వస్తోందంటే.. సైరా ను ఎంత గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నారో అర్ధమవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English