మే 18న ‘పంతం’ పట్టనున్న హీరో

మే 18న ‘పంతం’ పట్టనున్న హీరో

గోపీచంద్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో కూడా జనాలకు గుర్తు లేదు. గత దశాబ్ద కాలంలో ‘లౌక్యం’ మినహాయిస్తే అతడి కెరీర్లో సక్సెసే లేదు. గత ఏడాది గోపీ నుంచి వచ్చిన ‘గౌతమ్ నంద’.. ‘ఆక్సిజన్’ డిజాస్టర్లయ్యాయి. ఇప్పుడు అతడి ఆశలన్నీ తాను చేస్తున్న కొత్త సినిమా మీదే ఉన్నాయి. ఇది గోపీచంద్‌కు 25వ సినిమా కూడా కావడంతో కచ్చితంగా సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

చక్రి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘పంతం’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పుడా టైటిల్ కన్ఫమ్ అయింది. తమ సినిమాకు ‘పంతం’ అనే పేరు ఖరారు చేసినట్లుగా రోజు ప్రెస్ నోట్ ఇచ్చింది చిత్ర నిర్మాణ సంస్థ ‘సత్య సాయి ఆర్ట్స్’.

అంతే కాదు.. ‘పంతం’ రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. వేసవి కానుగా మే 18న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారట. ఇదొక యాక్షన్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ అని సమాచారం. గోపీచంద్ గడ్డం పెంచి కొంచెం డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు ఈ చిత్రంలో. గోపీ సరసన పంజాబీ భామ మెహ్రీన్ కథానాయికా నటిస్తోంది. మూడు వరుస హిట్లతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్.. తర్వాత ‘కేరాఫ్ సూర్య’, ‘జవాన్’ సినిమాలతో ఎదురు దెబ్బలు తింది.

ఆమెకు కూడా ఇప్పుడు హిట్టు చాలా అవసరం. ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో ఉన్న సినిమా ఇదొక్కటే. కొత్త దర్శకుడు చక్రికి కూడా తొలి ప్రయత్నంలో సక్సెస్ సాధించడం అత్యావశ్యకం. మరి ఇంతమంది ఆశల్ని ‘పంతం’ ఏమేరకు నిలబెడుతుందో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు