రెండు రోజుల్లో సగం పెట్టుబడి వెనక్కి..

రెండు రోజుల్లో సగం పెట్టుబడి వెనక్కి..

నాగశౌర్య కెరీర్లో విజయాలున్నాయి కానీ.. పెద్ద కమర్షియల్ సక్సెస్‌లైతే లేవు. ఆ లోటును ‘ఛలో’ తీర్చేసేలాగే ఉంది. సొంత నిర్మాణ సంస్థను పెట్టిన శౌర్య కుటుంబ సభ్యులే నిర్మించిన ఈ చిత్రం వారికి మంచి ఫలితాన్నే అందించేలా ఉంది. ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్లో రూపొందించి.. రూ.6 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మారు. అందులో సగం మొత్తం కేవలం రెండు రోజుల్లోనే వసూలైపోయినట్లు సమాచారం తొలి రోజే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.1.85 కోట్ల షేర్ వచ్చింది. టాక్ బాగుండటంతో వసూళ్లు రెండో రోజు కూడా స్టడీగా ఉన్నాయి. మొత్తం షేర్ రూ.3 కోట్ల మార్కును దాటింది. వీకెండ్ అయ్యేసరికి ‘ఛలో’ పెట్టుబడిలో ముప్పావు శాతం వసూలు చేసేస్తుందని అంచనా వేసేస్తున్నారు.

అమెరికాలో ‘ఛలో’ అంచనాల్ని మించి వసూళ్లు రాబడుతోంది. నాగశౌర్య కెరీర్లోనే అత్యధికంగా 110 దాకా స్క్రీన్లలో రిలీజైన ఈ చిత్రం ప్రిమియర్లతో 94 వేల డాలర్లు.. శుక్రవారం 1.35 లక్షల డాలర్లు వసూలు చేసింది. శనివారం కూడా లక్ష డాలర్లకు పైనే కలెక్షన్లు వచ్చాయి. ఆదివారం అయ్యేసరికి సినిమా 4 లక్షల డాలర్ల మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి చిన్న సినిమాకు వీకెండ్లోనే అక్కడ రూ.2.5 కోట్లకు పైగా గ్రాస్ అంటే చిన్న విషయం కాదు. అమెరికాలో బయ్యర్ ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కు వచ్చేసినట్లు సమాచారం. మొత్తానికి ‘ఛలో’పై పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరూ హ్యాపీ అయ్యేట్లున్నారు. నాగశౌర్య కెరీర్‌కు ఈ చిత్రం పెద్ద బూస్ట్ అనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు