ఎన్టీఆర్ బయోపిక్ బడ్జెట్ ఎంత?

ఎన్టీఆర్ బయోపిక్ బడ్జెట్ ఎంత?

నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమాకు సిద్ధమవుతున్నాడు. తన తండ్రి నందమూరి తారకరామారావు జీవిత కథతో తెరకెక్కబోయే ‘యన్.టి.ఆర్’ సినిమాలో బాలయ్య నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బాలయ్య.. సాయి కొర్రపాటి, విష్ణు ఇందుకూరిలతో కలిసి స్వయంగా నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి బాలయ్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ పెట్టనున్నారట. ఆ మొత్తం రూ.60 కోట్లని సమాచారం.

ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బాలయ్య ప్రొడక్షన్ విషయంలో అసలేమాత్రం రాజీ పడొద్దని నిర్ణయించుకున్నారట. ముందు తక్కువ బడ్జెట్లోనే సినిమా పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ తర్వాత ఈ సినిమా రీచ్ దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ పెంచినట్లు సమాచారం. ఎన్టీఆర్ జీవిత కథ అంటే జనాల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుందని.. కాబట్టి ఈ బడ్జెట్ రికవరీ కష్టం కాదనే భావిస్తున్నారట.

ప్రస్తుతం దర్శకుడు తేజ వెంకటేష్ సినిమా మీద దృష్టిపెట్టాడు. ఒక స్పెషల్ టీం ఎన్టీఆర్ బయోపిక్ ప్రి ప్రొడక్షన్ పనులు చూసుకుంటోంది. ఎన్టీఆర్ గురించి బాగా తెలిసిన 125 మంది రాజకీయ నాయకుల్ని ఈ చిత్ర బృందం కలిసి సమాచారం సేకరించిందని.. దాని ఆధారంగా సినిమాలో పొలిటికల్ సీన్లు తీర్చిదిద్దనున్నారని తెలిసింది. ఈ సినిమాలో మొత్తం 72 పాత్రలుంటాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక కోసం కూడా కసరత్తులు జరుగుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు