త‌ల‌కు రంగు వేశాడా? అదే రంగా?

త‌ల‌కు రంగు వేశాడా? అదే రంగా?

బాలీవుడ్ ద‌ర్శక మాంత్రికుడు క‌ర‌ణ్ జోహార్ పోస్టుల‌న్నీక్ష‌ణాల్లో వైర‌ల్ అయిపోతాయి. అలాంటిది ఒక వెరైటీ ఫోటో పెడితే... అందులో క‌ర‌ణ్ ఎప్ప‌టిలా కాకుండా... కాస్త కొత్త‌గా క‌నిపిస్తే వైర‌ల్ అవ్వ‌కుండా ఎలా ఉంటుంది.

క‌ర‌ణ్ పెళ్లికాక‌పోయినా ఇద్ద‌రు బిడ్డల తండ్రి. ఒక పాట‌, ఒక బాబు. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకో మ‌రే కార‌ణ‌మో కానీ... స‌రోగ‌సీ ప‌ద్ద‌తిలో ఇద్ద‌రు పిల్ల‌ల్ని క‌న్నాడు. టీవీలో, పేప‌ర్ల‌లో ఎక్క‌డ చూసినా చాలా యంగ్ గా, న‌ల్ల‌ని జుట్టుతో క‌నిపిస్తాడు. ఇటీవ‌ల ఆయ‌న ట్విట్ట‌ర్ లో పెట్టిన ఫోటోలో మాత్రం... పూర్తిగా న‌లుపు తెలుపుల మిశ్ర‌మంలో... బూడిద రంగు జుట్టుతో మెరిసిపోతున్నాడు. ఇక ఆయ‌న వేసుకున్న డ్రెస్ కూడా అదే రంగులో త‌ళుకులీనింది. గ్రేలో ఉన్న అన్ని షేడ్స్‌ను ఆ డ్రెస్‌లో, జుట్టులో చూపించేశాడు. అందుకే ఆంగ్ల మూవీ 50 షేడ్స్ ఆఫ్ గ్రే స్పూర్తితో... త‌న ఫోటోకు 500 షేడ్స్ ఆఫ్ గ్రే అని తానే క్యాప్ష‌న్ పెట్టుకున్నాడు.

ఇక్క‌డ తెలుసుకోవాల్సిన విష‌యం ఏంటంటే... ఫోటో అదిరింది కానీ... ఆ జుట్టుకి అలా రంగులు వేశాడా? అంకుల్ గారి అస‌లు జుట్టు రంగే అదా అన్న‌ది నెటిజ‌న్ల అనుమానం. ఎందుకంటే క‌ర‌ణ్ కు ఇప్పుడు 45 ఏళ్లు. ఈ వయ‌సులో జుట్టు నెర‌వ‌డం స‌హ‌జం. క‌నుక ఆ ఫోటోలో క‌నిపిస్తున్న‌ది ఆ స‌హ‌జ అంద‌మేనేమో అని కొంద‌రి డౌట్‌. క‌ర‌ణ్ కాస్త క్లియ‌ర్ చేస్తే బాగుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు