ముగ్గురు ముద్దుగుమ్మల తొలి సంతకం

ముగ్గురు ముద్దుగుమ్మల తొలి సంతకం

ఈ వారం త‌మిళ‌, తెలుగు, మ‌ళ‌యాళం భాష‌ల్లో అనేక సినిమాలు విడుదల‌య్యాయి. వాటిలో ఓ మూడు సినిమాలతో ముగ్గురు భామలు మూడు కొత్త బాషల్లో తొలి సంతకం పెడుతున్నారు. అందుకే ఆ ముగ్గురు హీరోయిన్ల‌కు కూడా ఈ వారం ఎంతో ప్ర‌త్యేకం.

తెలుగు సినిమాల‌ను ఒక ఊపు ఊపేసిన త్రిష... త‌రువాత ఇక్కడ అవ‌కాశాలు లేక త‌మిళ ఇండ‌స్ట్రీకి వెళ్లింది. అక్క‌డ కూడా ఏవో కొన్ని సినిమాలు చేసింది. ఇప్పుడు అక్క‌డ కూడా ఆమెకు ఏం అవకాశాలు లేవు. అందుకే మ‌ళ‌యాళం బాట ప‌ట్టింది. ఎట్ట‌కేల‌కు మ‌ల‌యాళంలో తెరంగేట్రం చేసింది. ఆమె చేసిన హే జూడ్ సినిమా ఈ రోజే విడుద‌లైంది. ఆ సినిమాలో ప్రేమ‌మ్ హీరో నివిన్ పౌలీ న‌టించాడు. ఆ సినిమా హిట్ట‌యితే ఇక త్రిష కొన్నాళ్ల కోచిలోనే ఉంటుందేమో.

తెలుగులో ఈ రోజున (ఫిబ్ర‌వ‌రి 2) విడుద‌ల‌రైన సినిమా ఛ‌లో. కామెడీ ప‌రంగా కాస్త ఫ‌ర్వాలేద‌నిపించింది. అందులో ఓ కొత్త హీరోయిన్ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. పేరు ర‌శ్మిక మండ‌న్నా. క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి చెందిన ఈ భామ ఛ‌లో సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది. ఆమె చేతిలో ఇంకా తెలుగు సినిమాలు ఉన్నాయ‌న్న సమాచారం వినిపిస్తోంది. న‌ట‌న, అందం ప‌రంగా అమ్మాయికి మంచి మార్కులే ప‌డ్డాయి మ‌రి.

ఇక మెగా డాట‌ర్‌ నిహారిక... తెలుగులో ఒక సినిమా చేసి త‌మిళ ఇండ‌స్ట్రీకి షిప్ట్ అయిపోయింది. అక్క‌డ ఆమె చేసిన తొలిమూవీ ఈ రోజే విడుద‌లైంది. ఒరు న‌ల్ల నాల్ పాతు సోల్రెన్ అన్న పేరుతో తీసిని ఆ సినిమాలో విజ‌య్ సేతుప‌తి హీరో. అత‌నికి జంటగా న‌టించింది నీహారిక‌. ఆ సినిమా హిట్ట‌యితే నీహారిక చెన్నైలో సెటిలైపోవ‌డం ఖాయం అంటున్నారు సినీ జ‌నాలు. ఆ సినిమాను తెలుగులో డ‌బ్ చేస్తారేమోన‌ని ఎంతో మంది మెగా అభిమానులు ఆశించారు కానీ...అలాంటిదేమీ లేద‌ని తేల్చేసింది చిత్ర‌యూనిట్‌.

మొత్త‌మ్మీద ముగ్గురు ముద్దుగుమ్మ‌లు కొత్త  సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కు ఒకే రోజు ప‌రిచ‌యం అయ్యారు. ముగ్గురిలో ఎవ‌రు హిట్ కొడ‌తారో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు