నిఖిల్ ఎందుకు ఏడ్చాడంటే..

నిఖిల్ ఎందుకు ఏడ్చాడంటే..

వరసగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. తొలిసినిమా హ్యాపీడీస్ లో ఆకతాయి కాలేజ్ స్టూడెంట్ గా కనిపించి అందరినీ మెప్పించాడు. తరవాత సినిమాల్లోనూ అదే ట్రెండ్ కొనసాగించినా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. స్వామి రారా నుంచి రూటు మార్చి సినిమాలు చేస్తూ హిట్లు కొట్టడం మొదలెట్టాడు.

నిఖిల్ చాలా రోజుల తరవాత మళ్లీ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశాడు. తాజాగా నటించిన కిరాక్ పార్టీ మూవీలో మళ్లీ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడు. ‘‘డైరెక్టర్ తేజ తీసిన జయం.. నువ్వు-నేను సినిమాల కోసం కాలేజి ఎగ్గొట్టి మరీ సినిమాలకెళ్లాను. హ్యాపీడేస్ అంతా కాలేజ్ బ్యాక్ డ్రాప్. మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి రోల్ చేశాను. ఇందులో నా పాత్ర చూశాక ప్రతి ఒక్కరికీ వాళ్ల కాలేజ్ డేస్ కచ్చితంగా గుర్తొస్తాయి. షూటింగ్ ఆఖరు రోజున ఎమోషన్ ఆపుకోలేకపోయాం. దాదాపుగా ఏడ్చేశాం’’ అంటూ కిరాక్ పార్టీ సినిమా తననెంతగా కదిలించిందీ చెప్పుకొచ్చాడు నిఖిల్.

కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కిరాక్ పార్టీని అదే పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా కోసం కన్నడ సీమ నుంచి సంయుక్త హెగ్డే.. సిమ్రన్ పరిందా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. దీంతోపాటు దర్శకుడిగా శరణ్ కొప్పిశెట్టి టాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు