ఇంటిలిజెంట్.. అక్కడ ఆశల్లేవనేనా?

ఇంటిలిజెంట్.. అక్కడ ఆశల్లేవనేనా?

వరుసగా ఒకటికి నాలుగు ఫ్లాపులు తిన్నాడు మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్. ఇప్పుడు అతడి ఆశలన్నీ ‘ఇంటిలిజెంట్’ మీదే ఉన్నాయి. ఈ చిత్రం వచ్చే వారం గట్టి పోటీ మధ్య రిలీజవుతోంది. మిగతా సినిమాల మాటేమో కానీ.. మెగా కుర్రాడే అయిన వరుణ్ తేజ్ సినిమాను ‘ఇంటిలిజెంట్’కు పోటీగా రిలీజ్ చేయాలనుకోవడం వివాదానికి దారి తీసింది. వరుణ్ ‘ఫిదా’ లాంటి బ్లాక్ బస్టర్‌తో ఊపుమీదున్నాడు. ‘తొలి ప్రేమ’పై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ వాళ్లే ఇన్వాల్వ్ అయి ‘తొలి ప్రేమ’ను ఒక రోజు వాయిదా వేయించినట్లు ప్రచారం జరిగింది. తేజు కెరీర్ రిస్కులో ఉన్న నేపథ్యంలోనే ఇలా చేశారంటున్నారు.

ఐతే అమెరికాలో మాత్రం ‘తొలి ప్రేమ’ ముందు అనుకున్న ప్రకారమే రిలీజ్ కానుంది. 9వ తేదీ వరల్డ్ వైడ్ రిలీజ్ అనుకుని 8వ తేదీకి ప్రిమియర్లు ప్లాన్ చేశారక్కడ. ఇప్పుడు ఆ విషయంలో మార్పేమీ లేదట. యథాప్రకారం 8నే.. అంటే విడుదలకు రెండు రోజుల ముందే ప్రిమియర్లు వేసేస్తారట. అమెరికాలో ‘ఇంటిలిజెంట్’ ప్రభావం దీని మీద కానీ.. దాని ప్రభావం ‘తొలి ప్రేమ’ మీద కానీ ఉండదని భావిస్తున్నారు. వినాయక్ తీసే మాస్ సినిమాలకు అక్కడ ఆదరణ అంతంతమాత్రం. తేజుకు కూడా అక్కడ పెద్దగా మార్కెట్ లేదు. కాబట్టి అక్కడ పోటీని లైట్ తీసుకుంటున్నారు. ‘ఇంటిలిజెంట్’ను అమెరికాలో ఏదో నామమాత్రంగా రిలీజ్ చేస్తున్నారు. ఐతే క్లాస్ లవ్ స్టోరీ కావడంతో ‘తొలి ప్రేమ’ను అక్కడ కొంచెం పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నారు. ప్రిమియర్లు కూడా ఎక్కువే పడుతున్నాయి. ఈ అడ్వాంటేజీని వదులకోవడానికి ఇష్టం లేని చిత్ర బృందం గురువారమే ప్రిమియర్లకు రంగం సిద్ధం చేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు