రవితేజకు తెలుగులో నచ్చిన హీరో?

రవితేజకు తెలుగులో నచ్చిన హీరో?

తెలుగులో ప్రతి కథానాయకుడికి ఇదే ఇండస్ట్రీలో అభిమాన హీరోలుంటారు. కానీ మాస్ రాజాకు మాత్రం తెలుగులో నచ్చిన హీరోనే లేడట. తన కొత్త సినిమా ‘టచ్ చేసి చూడు’ ప్రమోషన్లలో భాగంగా అభిమానులతో ట్విట్టర్లో చాట్ చేసిన అతను.. టాలీవుడ్లో మీకు నచ్చిన హీరో ఎవరు అని అడిగితే.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ‘రవితేజ’ అంటూ తన పేరునే చెప్పాడు మాస్ రాజా. ఐతే టాలీవుడ్ అని కాకుండా మీకు నచ్చిన హీరో ఎవరు అని అడిగితే.. ఇప్పటికీ ఎప్పటికీ నా అభిమాన కథానాయకుడు అమితాబ్ బచ్చన్ సారే అని జవాబిచ్చాడు రవితేజ. బిగ్-బి మీద తన అభిమానాన్ని గతంలోనూ చాలాసార్లు చాటుకున్నాడతను.

ఇక ‘విక్రమార్కుడు’తో మీ కెరీర్‌ను మరో మెట్టు ఎక్కించిన రాజమౌళితో సినిమా ఎప్పుడు చేస్తారు అని అడిగితే.. తప్పకుండా చేస్తానని అన్నాడు. పూరి జగన్నాథ్‌‌తో సినిమా గురించి అడిగితే.. త్వరలోనే ఉంటుందని చెప్పాడు. మంచి కథ వస్తే మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమన్న రవితేజ.. ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్లో రాజమౌళి రూపొందించబోయే మల్టీస్టారర్ మూవీలో విలన్ పాత్ర చేస్తున్నారటగా అని అడిగితే.. ‘‘ఏవేవో ఊహించుకోకండి. కానీ ఈ ఐడియా మాత్రం బాగుంది’’ అని బదులివ్వడం విశేషం. తన మిత్రుడు కాబట్టే శ్రీను వైట్లతో సినిమా చేయట్లేదని.. ఆ సినిమా కథ నచ్చిందని అన్నాడు. వైట్లతో చేయబోయే సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నారా అని అడిగితే.. వెయిట్ అండ్ సీ అని బదులిచ్చాడు మాస్ రాజా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు