మాస్ రాజా.. అదే పట్టుకు వేలాడాలా?

మాస్ రాజా.. అదే పట్టుకు వేలాడాలా?

రవితేజకు మాస్ రాజా అనే పేరు ఊరికే రాలేదు. హీరో అయ్యాక అతను చేసిన సినిమాల్లో మెజారిటీ మాస్ మసాలాలే. అతను ఎప్పుడైనా కొంచెం క్లాస్‌గా ట్రై చేస్తే.. ఎదురు దెబ్బే తగిలింది. ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’.. ‘శంభో శివ శంభో’.. ‘సారొచ్చారు’ లాంటి క్లాస్ టచ్ ఉన్న, భిన్నమైన కథలతో తెరకెక్కిన సినిమాలు మాస్ రాజాకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. దీంతో ఇక లాభం లేదని తనదైన స్టయిల్లో మాస్ మసాలా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు రవితేజ. మీరెందుకు కొత్త తరహా కథలతో సినిమాలు చేయరని అడిగితే చాలు.. పై చిత్రాల లిస్టు తీస్తున్నాడు రవితేజ. నేను కొత్తగా ట్రై చేస్తే జనాలు చూడలేదు అంటూ నెపం వాళ్ల మీదికి నెట్టేస్తున్నాడు.

కానీ కేవలం కొత్త కథలతో చేయడం వల్లే పై సినిమాలు ఆడలేదా.. ఇంకే కారణాలేమైనా ఉన్నాయా అన్నది కూడా చూడలేదు. కొత్త కథ అయినంత మాత్రాన ఆడాలనేమీ లేదు. ఆ కథను ఆసక్తికరంగా తీయడం కీలకం. కొత్త కథ అయినా బోర్ కొట్టిస్తే ప్రేక్షకులు ఎందుకు చూస్తారు? దీనికి తోడు ఇంకా వేరే కారణాలు కూడా తోడై సినిమాలు తేడా కొడుతుంటాయి. అంత మాత్రాన కొత్తవి చేస్తే చూడలేదు అంటూ రొటీన్ సినిమాలే చేస్తూ పోతే మనుగడ కష్టం. ఆమాటకొస్తే మాస్ రాజా చేసిన మాస్ మసాలా సినిమాలు ఎన్ని ఫ్లాప్ అవ్వలేదు. ‘ఆరెంజ్’ సినిమా డిఫరెంటుగా ట్రై చేస్తే తేడా కొట్టిందని రామ్ చరణ్ ఆ తర్వాత రొటీన్ మాస్ మసాలా సినిమాలు ట్రై చేశాడు. చివరికి ‘బ్రూస్ లీ’తో ఎదురు దెబ్బ తిన్నాడు. ప్రేక్షకుల అభిరుచి మారుతోందని గుర్తించి ‘ధృవ’ లాంటి భిన్నమైన సినిమా చేశాడు. మంచి ఫలితాన్నందుకున్నాడు. కాబట్టి రవితేజ కూడా ఇప్పటి ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని కొంచెం డిఫరెంటుగా ట్రై చేస్తే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు