అరుంధతి మ్యాజిక్‌ రిపీట్‌ కాలేదు

అరుంధతి మ్యాజిక్‌ రిపీట్‌ కాలేదు

అనుష్క స్టార్‌డమ్‌ని మరోసారి నిరూపిస్తూ భాగమతి ఆల్రెడీ హిట్‌ స్టేటస్‌ అందుకుంది. ఇప్పటికే లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ చిత్రానికి థియేట్రికల్‌ రన్‌ పూర్తయ్యేలోగా ముప్పయ్‌ కోట్ల వరకు షేర్‌ వస్తుందని అంచనాలున్నాయి. తెలుగులో సూపర్‌హిట్‌ అయిన ఈ చిత్రం తమిళంలో మాత్రం క్లిక్‌ అవలేదు.

అరుంధతి తమిళ వెర్షన్‌ అప్పట్లో పెద్ద హిట్‌ అయింది. తెలుగు అనువాదాలు చాలా అరుదుగా తమిళంలో హిట్‌ అవుతుంటాయి. అలాంటి అరుదైన ఘనత అరుంధతికి దక్కింది. అనుష్కకి బాహుబలితో వచ్చిన క్రేజ్‌ని దృష్టిలో వుంచుకుని, అరుంధతి రికార్డ్‌ని గుర్తు చేసుకుని భాగమతి తమిళ రైట్స్‌ ఫాన్సీ రేట్లకి కొన్నారు. మొదటి వారాంతంలో బాగానే ఆడిన ఈ చిత్రం ఆ తర్వాత డ్రాప్‌ అయింది. ఫైనల్‌గా తమిళనాట ఈ రైట్స్‌ తీసుకున్న వారికి స్వల్ప నష్టాలు తప్పవని అక్కడి ట్రేడ్‌ అంటోంది.

అరుంధతి మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తుందని అనుకున్న అనుష్క ఈసారి తమిళ బయ్యర్లని నిరాశ పరిచింది. అయితే తెలుగులో అంచనాలని అందుకుని అనుష్క స్టార్‌ పవర్‌ని ఇంకోసారి చాటి చెప్పింది. యుఎస్‌లో భాగమతి ఇప్పటికే ఎనిమిది లక్షల యాభై వేల డాలర్లు వసూలు చేసి ఈ వారాంతంతో మిలియన్‌ డాలర్లు అందుకునే దిశగా సాగుతోంది.