రవితేజలో ఎంత మార్పు!

రవితేజలో ఎంత మార్పు!

ఇదివరకు ప్రమోషన్ల మీద శ్రద్ధ పెట్టకపోయినా పని జరిగిపోయేది. కానీ ఇప్పుడు ఎంత పబ్లిసిటీ చేస్తే అంత బెనిఫిట్‌ వుంటుంది. గతంలో ప్రమోషన్స్‌ మీద ఆసక్తి చూపించని హీరోలు సైతం ఇప్పుడు పబ్లిసిటీ పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. గతంలో రవితేజ తన చిత్రాలకి పబ్లిసిటీ గురించి అంత లెక్క చేసే వాడు కాదు.

కానీ ఇప్పుడు ట్రెండుకి తగ్గట్టు అప్‌డేట్‌ అయ్యాడు. అన్ని టీవీ ఛానల్స్‌కి తిరగడమే కాకుండా సోషల్‌ మీడియా ద్వారా కూడా తన సినిమాని ప్రమోట్‌ చేస్తున్నాడు. 'టచ్‌ చేసి చూడు' చిత్రం విడుదలకి ముందు రోజు అభిమానులతో ట్విట్టర్‌ ద్వారా చాట్‌లో కూడా పాల్గొన్నాడు. ట్రెండ్‌కి తగ్గట్టు అప్‌డేట్‌ అయిన రవితేజని చూసి ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. బాలీవుడ్‌లో షారుక్‌, అమీర్‌ ఖాన్‌లాంటి హేమాహేమీలు కూడా పబ్లిసిటీ కోసం చాలా సమయం కేటాయిస్తారు.

అవకాశం వున్న ప్రతి చోటికీ వెళ్లిపోయి తమ చిత్రాన్ని వార్తల్లో వుంచుతారు. తెలుగునాట ఇంకా మన హీరోలకి ఆ స్థాయిలో పబ్లిసిటీ తాలూకు ప్రాధాన్యత తెలియడం లేదు. రవితేజలాంటి వాళ్లని చూసి అయినా మిగతావాళ్లు కూడా అన్ని మాధ్యమాల ద్వారా పబ్లిసిటీకి ఉపక్రమిస్తే బాగుంటుంది మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు