కొణిదెల, నందమూరి క్యాంప్స్‌ హర్ట్‌ అవకుండా

కొణిదెల, నందమూరి క్యాంప్స్‌ హర్ట్‌ అవకుండా

ఎన్టీఆర్‌, చరణ్‌తో రాజమౌళి మల్టీస్టారర్‌ అనౌన్స్‌ చేసాడు. కథ వినకుండా ఇద్దరు హీరోలు జక్కన్నకి సరే చెప్పేసారు. ఈ కాంబినేషన్‌ని అయితే కలిపాడు కానీ ఇప్పుడు ఇద్దరి హీరోల్లో ఎవరికీ అణుమాత్రం తక్కువ కాకుండా చూసుకోవడం అనేది కత్తి మీద సామే. స్టోరీ లైన్‌ ఓకే అయిపోయినా కానీ స్క్రీన్‌ప్లే పరంగా ఈ బ్యాలెన్స్‌ కోసం రాజమౌళి చాలా ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందట. ఏ సీన్లోను ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ కాకుండా, ఇద్దరికీ సమానమైన రోల్‌ వుండేలా, నటన పరంగా కూడా ఇద్దరికీ సమానమైన స్కోప్‌ వుండేలా రాజమౌళి కథనం చెక్కుతున్నాడట.

బాహుబలి, ఈగ లాంటి చిత్రాలకి కథనం రాయడానికి కూడా అంతగా శ్రమ పడని రాజమౌళికి ఈ చిత్రానికి మాత్రం తగని తలనొప్పి వచ్చిందట. ఎందుకని దర్శకులు మల్టీస్టారర్ల జోలికి పోరు అనేది స్వయంగా తెలుసుకుంటున్నాడట. తనని నమ్మి డేట్స్‌ ఇచ్చేసిన హీరోలకి, తనపై అచంచలమైన నమ్మకం పెట్టుకున్న ఇరు హీరోల కుటుంబాలు, అభిమానుల్లో ఎవరూ నిరాశ పడని విధంగా ఈ కథనం తీర్చిదిద్దడంపై రాజమౌళి కృషి చేస్తున్నాడట.

మామూలుగా తన పని తాను చేసుకుంటూ వేరే వ్యాపకాల మీద కూడా దృష్టి పెట్టే రాజమౌళి ఈ కథనం ఒక కొలిక్కి వచ్చే వరకు మరో వైపు ఫోకస్‌ పెట్టరాదని డిసైడ్‌ అయ్యాడట. ఈ చిత్రాన్ని నవంబర్‌లో మొదలు పెట్టి వచ్చే ఏడాది వేసవి చివర్లో విడుదల చేయాలనేది అతని ప్లాన్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు