ఆ మెగా హీరోకి దిల్‌ రాజే గాడ్‌ఫాదర్‌

ఆ మెగా హీరోకి దిల్‌ రాజే గాడ్‌ఫాదర్‌

సాయి ధరమ్‌ తేజ్‌ అవడానికి చిరంజీవి సొంత మేనల్లుడే అయినా కానీ అతనికి మెగా కుటుంబం నుంచి అంతగా సపోర్ట్‌ లేదు. హీరో కావడం దగ్గర్నుంచి ఆ తర్వాత తన కెరియర్‌ షేప్‌ చేసుకోవడం వరకు అన్నీ సొంతంగానే చేసుకుంటున్నాడు. తను హీరో అవడానికి ఎంకరేజ్‌ చేసిన పవన్‌కళ్యాణ్‌ అయితే ఇంతవరకు తేజ్‌ నటించిన ఒక్క సినిమా కూడా చూడలేదట.

ఇండస్ట్రీలో అనుభవమున్న పెద్దల అండదండలు లేనపుడు యువ హీరోలు చాలా తప్పులు చేస్తుంటారు. అలాగే సాయి ధరమ్‌ తేజ్‌ కూడా వరుస వైఫల్యాలతో ఇబ్బందుల్లో వున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న జవాన్‌ ఫ్లాప్‌ అవడంతో ఇప్పుడిక వినాయక్‌ అయినా గట్టున పడేయకపోతాడా అని చూస్తున్నాడు. ఇంటిలిజెంట్‌ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. నిజానికి ఈ చిత్రానికి వరుణ్‌ తేజ్‌ సినిమా తొలిప్రేమతో సరాసరి క్లాష్‌ ఏర్పడింది. ముందుగా ఈ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నామని తేజ్‌ రాజీ కోసం చూసినా పని జరగలేదట.

దాంతో దిల్‌ రాజు దగ్గరకి వెళ్లి తన గోడు చెప్పుకుంటే తేజ్‌కి గాడ్‌ఫాదర్‌లా వ్యవహరిస్తోన్న దిల్‌ రాజు తన చాతుర్యంతో తొలిప్రేమ చిత్రాన్ని ఒక్క రోజు వెనక్కి పంపాడు. తొలిప్రేమ చిత్రాన్ని కొన్న దిల్‌ రాజుకి ఇది కొంచెం నష్టం తెచ్చే విషయమే. అయితే సాయి ధరమ్‌ తేజ్‌ కోసమని దిల్‌ రాజు ఈ త్యాగం చేసాడు. ఇప్పటికే దిల్‌ రాజు గీసిన గీత దాటనంటూ కూర్చున్న సాయి ధరమ్‌ తేజ్‌ ఇప్పుడు అతనికి ఎమోషనల్‌గా మరింత సరెండర్‌ అయిపోయాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు