మెగా కాంపౌండ్ నుంచి మంచు కాంపౌండ్లోకి

మెగా కాంపౌండ్ నుంచి మంచు కాంపౌండ్లోకి

పూరి జగన్నాథ్ శిష్యుడు, యువ దర్శకుడు పరశురామ్ కెరీర్ ఎప్పుడూ అంత సజావుగా సాగలేదు. తొలి సినిమా ‘యువత’ పర్వాలేదనిపించినా.. రెండో సినిమా ‘ఆంజనేయులు’ తుస్సుమనిపించింది. తర్వాత ‘సోలో’తో తనేంటో రుజువు చేసుకున్నా.. ‘సారొచ్చారు’ దెబ్బ కొట్టింది. మళ్లీ మెగా కాంపౌండ్లోకి అడుగుపెట్టి ‘శ్రీరస్తు శుభమస్తు’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీని అందించాడు. అతడి టాలెంటుకు మెచ్చి అల్లు అరవిందే అతడి తర్వాతి సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. ‘అర్జున్ రెడ్డి’తో స్టార్ ఇమేజ్ సంపాదించిన విజయ్ దేవరకొండ కథానాయకుడిగా అతను ప్రస్తుతం ఒక సినిమాను రూపొందిస్తున్నాడు.

ఈ చిత్రం పూర్తి కాకముందే పరశురామ్ తర్వాతి సినిమా ఓకే అయిపోయినట్లు సమాచారం. మెగా కాంపౌండ్ నుంచి మంచు వారి కాంపౌండ్ లోకి జంప్ చేస్తున్నాడట పరశురామ్. మంచు విష్ణు హీరోగా పరశురామ్ తర్వాతి సినిమా ఉంటుందట. ఈ చిత్రాన్ని మంచు వాళ్ల సొంత బేనర్లోనే తెరకెక్కిస్తారట. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు. ప్రస్తుతం విష్ణు.. ‘ఆచారి అమెరికా యాత్ర’తో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమయ్యాడు. దీని తర్వాత ‘ఓటరు’ పూర్తి చేసే పనిలో పడతాడు. ‘ఆచారి అమెరికా యాత్ర’ దర్శకుడు నాగేశ్వరరెడ్డితోనూ అతడికి మరో కమిట్మెంట్ ఉంది. దాని కంటే ముందు పరశురామ్ దర్శకత్వంలో నటించనున్నాడట విష్ణు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు