ఔను.. మహేష్ పక్కన చేస్తున్నా

ఔను.. మహేష్ పక్కన చేస్తున్నా

‘దువ్వాడ జగన్నాథం’ సినిమా హిట్టేమీ కాదు. ఆ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ బాగా రావడం వల్ల యావరేజ్ అనిపించుకుంది. ఐతే ఆ సినిమా వల్ల పూజా హెగ్డేకు మాత్రం చాలా పేరొచ్చింది. సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన అంశాల్లో పూజా గ్లామర్ ఒకటి. తొలి రెండు సినిమాల్లో ట్రెడిషనల్‌ లుక్‌లో దర్శనమిచ్చిన పూజా.. ‘డీజే’లో మాత్రం రెచ్చిపోయింది. బికినీ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. కాబట్టే ‘డీజే’ ఫలితంతో సంబంధం లేకుండా పూజాకు తెలుగులో క్రేజ్ వచ్చేసింది. ఏకంగా కోటిన్నర పారితోషకంతో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు కథానాయికగా ఎంపికైన పూజాపై స్టార్ హీరోల కళ్లు పడ్డాయి.

అల్లు అర్జున్ తర్వాత మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేయబోతోంది పూజా. వంశీ పైడిపల్లి-మహేష్ సినిమాలో పూజానే కథానాయిక అనే విషయం చాన్నాళ్ల కిందటే ప్రచారంలోకి వచ్చింది. ఐతే ఇంకా దీనిపై అధికారిక ప్రకటనే రాలేదు. ఈలోపు పూజానే ఈ విషయాన్ని ధ్రువీకరించింది. తాను మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాననే విషయం పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ ట్విట్టర్లో మెసేజ్ పెట్టింది పూజా. ఈ చిత్రాన్ని దిల్ రాజు-అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తున్నాడు. ఏప్రిల్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది. ప్రస్తుతం మహేష్ ‘భరత్ అనే నేను’ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు