అమ‌ల వెర్ష‌న్ స‌రే... అత‌నేమంటాడో?

అమ‌ల వెర్ష‌న్ స‌రే... అత‌నేమంటాడో?

అమ‌లా పాల్ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుని మీడియాలో న‌లుగుతూనే ఉంది. మొన్న‌టిమొన్న ఖ‌రీదైన కారు కొని ప‌న్ను క‌ట్ట‌కుండా ఎగ్గొట్టిందంటూ కేసు నమోదైంది. ఎలాగో బెయిలు తెచ్చుకుని బ‌య‌ట‌ప‌డింది. ఈ లోగానే ఆమె ఓ వ్యాపార‌వేత్త‌పై సంచ‌ల‌న కేసును పెట్టింది. అస‌లు ఒక వ్యాపార‌వేత్త నేరుగా హీరోయిన్ నే అలా అడిగే ధైర్యం చేస్తాడా?  అమ‌లా ఆరోప‌ణ‌ల్లో నిజ‌మెంత‌? ఈ వైపుగా కూడా ఓసారి ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంది.

అమ‌లాపాల్ చెప్పిన దాని ప్ర‌కారం... ఆమె త్వ‌ర‌లో మ‌లేషియాలో డ్యాన్స్ ప్రోగ్రామ్ కు వెళ్లాల్సి ఉంది. అందులో ఒక స్టూడియోలో రిహార్స‌ల్స్ చేస్తున్న ఆమె ద‌గ్గ‌రికి అల‌గేశ‌న్ అనే వ్యాపార‌వేత్త వ‌చ్చాడు. త‌న కోరిక తీరిస్తే ఎంత డ‌బ్బు కావాల‌న్న ఇస్తాన‌ని అన్నాడు. చాలా భ‌య ప‌డిన అమ ల నేరుగా పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చి కేసు పెట్టింది. ఇంత‌వ‌ర‌కు అంద‌రికీ తెలిసిన క‌థ‌. అయితే ఎంత పెద్ద వ్యాపార‌వేత్త అయినా హీరోయిన్‌ని నేరుగా అడిగే ధైర్యం ఎలా చేశాడు? ఒక‌వేళ అత‌నికి అలాంటి ఆలోచ‌నే ఉంటే... మ‌ధ్య‌వ‌ర్తిని పంపించే అవ‌కాశాలే ఎక్కువంటున్నారు సినీ జ‌నాలు. అలా నేరుగా అడిగితే పెద్ద ర‌చ్చే అవుతుంద‌న్న విష‌యం అల‌గేశ‌న్ తెలుసుకోలేనంత అమాయ‌కుడేం కాదు.

ఇకపోతే అమ‌ల‌తో ఎలాంటి ప‌రిచ‌యం లేకుండానే త‌న కోరిక‌ను ఆమెకు చెబుతాడా? అనే కోణంలో కూడా చ‌ర్చ‌లు అవుతున్నాయి. వారిద్ద‌రికీ ముందే ప‌రిచ‌యం ఉందా? ఏదైనా విష‌యంలో చెడిందా? అందువ‌ల్లే అమ‌ల అత‌నిపై రివ‌ర్సులో కేసు పెట్టిందా? అని చ‌ర్చించుకుంటున్నారు ఫిల్మ్‌న‌గ‌ర్ వాసులు. అమ‌ల స్టోరీ ఏదో తేడా కొడుతోందంటున్నారు. అమ‌ల చెప్పిందే విని... అత‌డిని తిట్ట‌డం స‌రికాదేమో అని కూడా కొంద‌రు అభిప్రాయ ప‌డుతున్నారు. ఈ విష‌య‌మేదో  పోలీసులే తేల్చాలి.

గ‌తంలో విజ‌య్ అనే ద‌ర్శ‌కుడిని అమ‌ల ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ల‌యి రెండేళ్ల‌య్యిందో లేదో విడాకులు తీసుకుంది. విజ‌య్ ఇంట్లో వారు త‌న‌ను వేధిస్తున్నారంటూ కేసు పెట్టింది. అప్ప‌ట్లో అమ‌ల‌ను సినిమాల‌కు దూరంగా ఉండ‌మ‌ని విజ‌య్ కుటుంబం కోరింద‌ని, అందుకే అమ‌ల విడాకులు తీసుకుంద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. విడాకులు త‌రువాత మ‌ళ్లీ సినిమాల్లో నిల‌దొక్కుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ మ‌ధ్య‌లోనే ఈ కేసుల, స‌మ‌స్య‌లు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు