ఫ్యామిలీ హీరోలపై మెగా స్టార్ సీరియస్

ఫ్యామిలీ హీరోలపై మెగా స్టార్ సీరియస్

వీలయినంత వరకు పెద్ద చిత్రాల నుంచి మీడియం బడ్జెట్ చిత్రాల వరకు వీలైనంత వరకు పోటీ లేకుండా చూసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని థియేటర్లకు తీసుకొస్తున్నారు. అప్పుడే అన్ని సెంటర్లలో సినిమా రిలీజ్ చేసి మాగ్జిమం కలెక్షన్లు కళ్లజూడొచ్చు. ఇతర హీరోలే ఇంత జాగ్రత్తగా ఉన్న రోజుల్లో మెగా ఫ్యామిలీలో మాత్రం ఇద్దరు ఒకేసారి సినిమా రిలీజ్ చేస్తుండటం మెగాస్టార్ చిరంజీవికి చాలా కోపం తెప్పించిందని తెలుస్తోంది.  

వి.వి.వినాయక్ డైరెక్షన్లో సాయిధరమ్ తేజ్ నటించిన ఇంటిలిజెంట్.. కొత్త దర్శకుడు వెండీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ ఒకరోజు తేడాలో రాబోతున్నాయి. ముందు అనుకున్న ప్రకారమైతే రెండూ ఒకేరోజు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ దిల్ రాజు టీం వెనక్కి తగ్గడంతో తొలిప్రేమ ఒకరోజు వెనుక వస్తోంది. ఇలా ఒకేసారి రెండు సినిమాలు వస్తే మెగా హీరోల మధ్య సఖ్యత లేదనే మెసేజ్ అభిమానులకు వెళ్తుందని.. ఇది మంచి పరిణామం కాదని చిరంజీవి ఫీలవుతున్నారట. ఈ విషయంపై వాళ్లిద్దరినీ ఇంటికి పిలిపించి గట్టిగా క్లాస్ తీసుకోవాలనే అనుకుంటున్నారని మెగా ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్నారు. గట్టి వార్నింగ్ ఇస్తేనే ఫ్యామిలీలోనే పోటీపడే పరిస్థితి ఇకపై రాకుండా ఉంటుందునే మెగాస్టార్ ఒపీనియన్ గా తెలుస్తోంది.  

సినిమా రిలీజయ్యాక హిట్టా.. ఫట్టా అనేది మార్నింగ్ షోతో వచ్చే టాక్ తోనే తెలిసిపోతుంది. సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంటే మరో మూవీ ఏదీ పోటీ లేకపోతే పెట్టిన పెట్టుబడితోపాటు ఏదో కొద్దిగా లాభాలొస్తాయి. పోటీ ఉంటే మాత్రం అంతే సంగతులు. అలాంటప్పుడు అవనసరమైన పోటీతో ఒరిగేదేం ఉండదు. పైగా ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ కు భంగం రావడం తప్ప. ఆ యాంగిల్ లో మెగాస్టార్ కు కోపం రావడం సహజమే మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు