గాంధీ పాత్ర‌లో ఆమెను ఊహించ‌గ‌ల‌మా?

గాంధీ పాత్ర‌లో ఆమెను ఊహించ‌గ‌ల‌మా?

బాల‌య్య ఎంతో ఇష్టంతో త‌న తండ్రి బ‌యోపిక్‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌గా తానే న‌టిస్తున్నాడు. కాగా ఆ సినిమాలో ఇందిరా గాంధీ పాత్ర కోసం న‌దియాను అనుకుంటున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఆమెతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం. కానీ న‌దియా ఇందిరా గాంధీ పాత్ర‌కు సెట్ అవుతుందా?

అప్ప‌టి హీరోయిన్ న‌దియా... ఇప్పుడు హీరోల‌కు త‌ల్లిగానో, అత్త‌గానో తెర‌పై క‌నిపిస్తోంది. అలాంటి పాత్ర‌లు వేసే మిగ‌తా ఆర్టిస్టులు సుధ‌, అన్న‌పూర్ణ‌మ్మ లాంటి వారితో పోలిస్తే న‌దియా ముఖంలో ఎక్స్‌ప్రెష‌న్స్ చూపించేది త‌క్కువే. అస‌లు ఆమెకు న‌ట‌నే రాద‌ని కూడా ఫిల్మ్ న‌గ‌ర్ వాసుల అభిప్రాయం. ఏదో గ్లామ‌ర‌స్ అత్త పాత్ర‌లో అలా కానిచ్చేయ‌డానికి త‌ప్ప‌... న‌ట‌న‌కు ఆస్కార‌మున్న పాత్ర‌ల‌కు ఆమె స‌రిపోదంటారు సినీజ‌నాలు. మ‌రి ఆమెను ఎలా ఇందిరా గాంధీ పాత్ర‌కి తీసుకుంటారన్న ప్ర‌శ్న వారందరిలోనూ క‌నిపిస్తోంది.

బాలీవుడ్ ఇందిరా గాంధీ బ‌యోపిక్‌లో విద్యాబాల‌న్ న‌టిస్తోంది. విద్య గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ముఖంలో ఉద్వేగాల‌ను, హావ‌భావాల‌ను చ‌క్క‌గా ప‌లికిస్తుంది. ఆమె ఆ పాత్ర‌కు న్యాయం చేస్తుంద‌నే ఎక్కువ‌మంది న‌మ్మ‌కం. అలాగే ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో కూడా ఇందిరా పాత్ర‌కు కాస్త న‌ట‌న తెలిసిన మంచి న‌టిని తీసుకోవాల‌ని ఆశిస్తున్నారు సినీ జ‌నాలు. వారి కోరిక కూడా స‌మంజ‌స‌మే అనిపిస్తోంది.

 ఈ చిత్రంలో ఒక సామాన్య కుంటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ మహానటుడిగా ఎలా ఎదిగారు? రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? అనే అంశాలను చూపించబోతున్నారు. బాల‌య్యే ఈ సినిమాకు నిర్మాత‌. తేజ ద‌ర్శ‌కుడు. కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు