తొలిప్రేమకు మొదటి రోజే ఇంపార్టెంట్

తొలిప్రేమకు మొదటి రోజే ఇంపార్టెంట్

వ‌రుణ్ తేజ్ కెరీర్ ఇప్పుడు తొలిప్రేమ సినిమాపైనే ఆధార‌ప‌డి ఉంద‌న‌వ‌చ్చు. ఫిదాతో మంచి విజ‌యాన్ని అందుకున్న‌ప్ప‌టికీ... ఆ సినిమా విష‌యం కాస్త చ‌లాకీ పిల్ల సాయి ప‌ల్ల‌వి ఖాతాలోకే వెళ్లిపోయింది. క‌నుక ఇప్పుడు  తొలిప్రేమ క‌చ్చితంగా హిట్ కొట్టాల్సిన ప‌రిస్థితే. హిట్ కొట్టిందో వ‌రుణ్ స్టార్ హీరో అయిపోతాడు.  అయితే ఇప్ప‌టికే తొలిప్రేమ‌... మ‌రో మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమా ఇంటెలిజెంట్ తో క్లాష్ కొట్టింది. రెండూ ఒకేరోజు విడుద‌ల అని ప్ర‌క‌టించారు. కానీ దిల్ రాజు త‌న‌దైన లెక్కలు వేసుకుని... తొలిప్రేమ‌ను ఒక‌రోజు వాయిదా వేశారు.

నిజానికి తొలిప్రేమ సినిమా సక్సెస్ వరుణ్‌ తేజ్ కు చాలా అవసరం. ఎందకంటే ఫిదా సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయినా కూడా.. ఆ క్రేజ్ మొత్తం సగం శేఖర్ కమ్ముల.. సగం సాయిపల్లవి కొట్టేశారు. అసలు వరుణ్‌ పేరు ఊసులో లేకుండా పోయిందంటే అతిశయోక్తి కాదు. అందుకే ఇప్పుడు తొలిప్రేమకు బలమైన ఓపెనింగ్స్ రావాలి. మొదటిరోజునే రికార్డ్ బ్రేకింగ్ నెంబర్లు కనిపిస్తేనే.. అది వరుణ్‌ తేజ్ క్రేజ్ అన్నట్లు ఉంటుంది. ఈ ప్రొడ్యూసర్ కాని.. ఇక కొత్తగా డైరక్షన్ పగ్గాలు చేపట్టిన వెంకీ కాని సినిమాకు ఓపెనింగులు తేలేరు. కేవలం మెగా హీరో ఒక్కడే చేయగలడు. అందుకే ఇప్పుడు అందరి ఫోకస్ తొలిప్రేమ ఫస్ట్ డే మీదనే పడింది.

ఇప్పటికే నిర్మాత దిల్ రాజు మాత్రం తొలిప్రేమ క‌చ్చితంగా హిట్ సినిమా అని తేల్చేస్తున్నాడు. క‌నుక ఇంటెలిజెంట్ క్లాష్ అవ‌కుండా ఇండియాలో ఫిబ్ర‌వ‌రి 10న విడుద‌ల చేయాల‌ని తానే నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు చెప్పాడు. అంతా బాగానే ఉంది.. ఈ మధ్యన దిల్ రాజు కాన్ఫిడెంటుగా చెబుతున్న సినిమాల్లో చాలావాటికి గట్టి కలక్షన్లు వచ్చినా.. తను ప్రొడ్యూస్ చేసిన సినిమాలు. ఇదేమో కేవలం పంపిణీ చేస్తున్నాడంతే. సో చూద్దాం ఏమవుతుందో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు