అమ్మా నిత్యా.. ఏందీ అవతారం?

అమ్మా నిత్యా.. ఏందీ అవతారం?

తొలి సినిమా ‘అలా మొదలైంది’తోనే తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది నిత్యా మీనన్. మలయాళ అమ్మాయే అయినా తొలి సినిమాలోనే చక్కగా తెలుగులో మాట్లాడుతూ.. టిపికల్ అందంతో కనిపిస్తూ.. చక్కగా నటిస్తూ.. ఒక పాట కూడా పాడి.. అన్ని రకాలుగా మన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత నిత్య తెలుగులో చేసిన సినిమాలన్నీ స్పెషలే.

 ఆమెకు ఇక్కడ లక్షలాది మంది అభిమానులు ఏర్పడ్డారు. ఎప్పుడూ తన నటనతో డామినేట్ చేసే నిత్యకు ఆమె హైట్ కానీ.. లుక్స్ కానీ పెద్ద అడ్డంకి కాలేదు. కానీ గతంలోనే కొన్ని సినిమాల్లో షేపవుట్ అయి కనిపించినప్పటికీ.. ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు కానీ.. ఆమె తాజా అవతారం చూసి మాత్రం షాకైపోతున్నారు.

‘అ’ సినిమాలో నిత్య పూర్తి లుక్ ఎలా ఉందో ఇంకా స్పష్టత రాలేదు కానీ.. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో మాత్రం నిత్య అవతారం అందరినీ విస్మయానికి గురి చేసింది. బాగా లావైపోయి.. పూర్తిగా షేపవుటైపోయి.. ఊహించిన విధంగా కనిపించింది నిత్య. ఆమెను చూస్తే సినిమాలకు దూరమయ్యాక పూర్తిగా అవతారం మార్చేసిన రక్షిత గుర్తుకొచ్చింది. మున్ముందు రక్షిత లాగే అయినా ఆశ్చర్యం లేదేమో. అసలే నిత్య పొడవు తక్కువ. అలాంటపుడు లావైతే చూడ్డానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది.

నిత్య ఎంత ప్రతిభావంతురాలైనప్పటికీ.. హీరోయిన్ అన్నాక కొంచెం ఫిజిక్ మెయింటైన్ చేయాలి. ఆమె లాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్ ఇప్పుడే ఇలా తయారైతే.. ఇక మున్ముందు అవకాశాలు కష్టం. ఆమె మాత్రమే చేయగలిగిన స్పెషల్ క్యారెక్టర్ ఏదైనా ఉన్నప్పటికీ.. ఈ అవతారంతో ఆమెను నటింపజేయాలని ఎవ్వరూ అనుకోరు. కాబట్టి నిత్య అర్జెంటుగా షేపులు మార్చుకునే ప్రయత్నం చేస్తే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు