ఎన్టీఆర్‌ బాటలో రవితేజ!

ఎన్టీఆర్‌ బాటలో రవితేజ!

జై లవకుశ చిత్రం ముందుగా రవితేజతోనే చేద్దామని అనుకున్నారు. అతను ఇచ్చిన ఐడియా మేరకే బాబీ ఆ కథ రాసుకున్నాడు. గాడ్‌ఫాదర్‌ అనే తమిళ చిత్రానికి దగ్గరగా ఒక సినిమా చేయాలని రవితేజ సూచిస్తే బాబీ ఈ కథతో వచ్చాడు. అయితే ఎందుకో అది చేతులు మారిపోయి ఎన్టీఆర్‌ చేసేసాడు. అలా త్రిపాత్రాభినయం చేయాలనే రవితేజ ముచ్చట తీరలేదు.

అయితే జై లవకుశ కూడా హిట్‌ అవలేదు కనుక రవితేజ పెద్దగా బాధ పడాల్సిన పని లేదు. కాకపోతే మూడు పాత్రల్లో కనిపించాలనే ముచ్చట మాత్రం ఇంకా అలాగే వుంది. మరి రవితేజ ఆ విషయాన్ని శ్రీను వైట్ల వద్ద చెప్పాడో లేక వైట్లకే ఐడియా వచ్చిందో కానీ రవితేజ కోసం త్రిపాత్రాభినయంతో కూడిన కథనే సిద్ధం చేస్తున్నాడు. 'రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌' అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. మరి ఈ మూడు పాత్రలకి తగ్గట్టు మాస్‌ మహారాజా తనని తాను ఎలా మలచుకుంటాడనేది చూడాలి.

తనని హీరోని చేసిన శ్రీను వైట్ల రుణం తీర్చుకోవడానికే ఈ చిత్రం చేస్తున్నారా అనే ప్రశ్నకి రవితేజ ఘాటైన సమాధానర ఇచ్చాడు. ఇక్కడ ఎవరూ ఎవరికీ బ్రేక్‌లు ఇవ్వరని, కథ నచ్చితేనే చేస్తామని, వైట్ల చెప్పిన కథ నచ్చి అతనితో పని చేస్తున్నానే తప్ప మరో కారణం లేదని స్పష్టం చేసాడు. ఆగడు, బ్రూస్‌లీ, మిస్టర్‌ లాంటి డిజాస్టర్‌ హ్యాట్రిక్‌తో తన కెరియర్‌ని ప్రశ్నార్ధకంలో పడేసిన శ్రీను వైట్ల బౌన్స్‌ బ్యాక్‌ అవడానికి ఇదే సూపర్‌ ఛాన్స్‌ మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు