దిల్‌ రాజు లెక్క తప్పా, ఒప్పా!

దిల్‌ రాజు లెక్క తప్పా, ఒప్పా!

ఫిదాతో భారీ విజయాన్ని అందుకున్న వరుణ్‌ తేజ్‌ మలి చిత్రం 'తొలిప్రేమ'ని దిల్‌ రాజు మంచి రేటుకి కొనేసాడు. మొత్తం డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ తనే తీసేసుకున్న దిల్‌ రాజు ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌పై కూడా నిర్ణయం తీసేసుకున్నాడు. ఫిబ్రవరి 9న ఇంటిలిజెంట్‌ సినిమాతో క్లాష్‌ వద్దని తొలిప్రేమని ఒకరోజు వాయిదా వేయించాడు.

ఇది తనంతట తానుగా తీసుకున్న నిర్ణయమని, తాను ఈ డెసిషన్‌ తీసుకుని నిర్మాతలు భోగవల్లి ప్రసాద్‌, సి. కళ్యాణ్‌తో చెప్పానని, వారు కూడా అంగీకరించారని చెప్పాడు. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 10న విడుదలవుతోన్న తొలిప్రేమని ఓవర్సీస్‌లో మాత్రం ఒక రోజు ముందే విడుదల చేయడానికి చూస్తున్నామని కూడా దిల్‌ రాజు తెలిపాడు. ఈ సినిమా చూసానని, ఖచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుందని అంటూ ఓవర్సీస్‌లో ముందుగా రిలీజ్‌ చేసిన హ్యాపీడేస్‌, శతమానం భవతి సూపర్‌హిట్‌ అయ్యాయని గుర్తు చేసాడు.

ప్రస్తుతం ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూటర్‌తో డిస్కస్‌ చేస్తున్నామని, అన్నీ కుదిరితే అక్కడ ఒక రోజు ముందుగా ఇది రిలీజ్‌ అవుతుందని చెప్పాడు. ఎలాగో సాయి ధరమ్‌ తేజ్‌ చిత్రాలకి యుఎస్‌లో అంతగా గిరాకీ వుండదు కనుక తొలిప్రేమని దాంతో పాటే విడుదల చేయడం తెలివైన నిర్ణయమే. అయితే టాక్‌ తేడా అయితే మాత్రం ఇక్కడ లోకల్‌ రిలీజ్‌ చాలా ఎఫెక్ట్‌ అవుతుంది. ఇంత రిస్కుతో కూడుకున్న నిర్ణయానికి తొలిప్రేమ బృందం సరేనంటుందో లేదో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు