ఫ్రీ `జీఎస్టీ` క్యాన్సిల్...వ‌ర్మ‌కు షాక్!

ఫ్రీ `జీఎస్టీ` క్యాన్సిల్...వ‌ర్మ‌కు షాక్!

ప్ర‌ముఖ అమెరిక‌న్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో వివాదాస్ప‌ద‌ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెర‌కెక్కించిన  గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ (జీఎస్టీ) పై పెను దుమారం రేగిన సంగ‌తి తెలిసిందే. ఆ వీడియో వెబ్ ఫిల్మ్ ను బ్యాన్ చేయాల‌ని, వ‌ర్మ‌ను అరెస్టు చేయాల‌ని ప‌లు మ‌హిళా సంఘాలు డిమాండ్ చేసిన సంగ‌తి విదిత‌మే. వ‌ర్మ త‌మ‌ను అవ‌మానించాడంలూ...సామాజిక కార్య‌క‌ర్త దేవి అత‌డిపై కేసు కూడా పెట్టారు. ఇన్ని వివాదాల న‌డుమ వ‌ర్మ ఆ వెబ్ ఫిల్స్ ను ఒక రోజు ఆల‌స్యంగా విడుద‌ల చేశారు. అయితే, భార‌త్ లో దానిని ఉచితంగా వీక్షించ‌వచ్చ‌ని తెలిపిన వ‌ర్మ‌....ఆ త‌ర్వాత రూ.150 చెల్లించాల‌ని చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పాడు.  అయితే చివ‌ర‌కు ఫ్రీగా వీక్షించే అవ‌కాశాన్ని క‌ల్పించారు. అయితే, తాజాగా ఆ వెబ్ ఫిల్మ్ ఉచిత వీక్ష‌ణను ఇండియాలో రద్దు చేస్తున్నట్లు ప్రసార సంస్థ విమియా వెబ్‌సైట్ షాకింగ్ ప్ర‌క‌ట‌న చేసింది.

జీఎస్టీ ఉచిత ప్ర‌సారంపై మ‌హిళా సంఘాల‌నుంచి తీవ్ర వ్యతిరేక‌త రావ‌డంతో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు...... ప్రసార సంస్థ విమియా వెబ్‌సైట్ కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో, పోలీసుల ఆదేశాల‌ను పాటించిన విమియో....ఆ ఉచిత ప్రసారాలను నిలిపేస్తున్నట్లు  హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులకు లేఖ రాశారు. విమియో నిర్ణయంపై  సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అయితే, 3డాలర్లు చెల్లించి వీక్షించే సదుపాయాన్ని కూడా రద్దు చేయాలని కోరారు. దీనిపై విమియో నుంచి స్పంద‌న రావాల్సి ఉంది. జీఎస్టీ చూడాలంటే.... అమెరికా, కెనడాలో 2.99 డాలర్లు, యూరప్‌లో 1.99 పౌండ్లు, భారత్‌లో రూ. 150, శ్రీలంకలో రూ. 200 చెల్లించాలి. మొద‌టి సిరీస్ గ్రాండ్ స‌క్సెస్ కావ‌డంతో త్వ‌ర‌లోనే రెండో సిరీస్ ను వ‌ర్మ ప్లాన్ చేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు