వావ్!! హైదరాబాద్ లో ప్రపంచసుందరి

వావ్!! హైదరాబాద్ లో ప్రపంచసుందరి

మిస్ వ‌ర‌ల్డ్ గా గెలిచి భార‌త‌దేశాన్ని ప్ర‌పంచ‌దేశాల మ‌ధ్య గ‌ర్వంగా త‌లెత్తుకునేలా చేసింది మానుషి చిల్ల‌ర్‌. మ‌ల్లె తీగలా ఉన్న ఈ భామ మిస్ వ‌ర‌ల్డ్ గా గెలిచాక తొలిసారి హైద‌రాబాద్‌లో అడుగుపెట్టింది. అది కూడా ఓ గొప్ప ప‌ని చేసేందుకు.

2000వ సంవ‌త్స‌రంలో ప్రియాంక చోప్రా మిస్ వ‌రల్డ్ కిరీటాన్ని మ‌న‌దేశానికి తెచ్చింది. ఆ త‌రువాత మ‌ళ్లీ మ‌న‌కి అవ‌కాశం రాలేదు. ప‌దిహేడేళ్ల త‌రువాత మానుషి మ‌ళ్లీ ఆ కిరీటాన్ని మ‌న‌దేశానికి తెచ్చింది. అందుకే ఆమెకు త‌క్కువ స‌మ‌యంలోనే బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ వ‌చ్చింది. ఇప్పుడు ఆ ఫాలోయింగ్ మ‌రింత పెరిగేలా క‌నిపిస్తోంది. బ్యూటీ విత్ ప‌ర్స‌స్ పేరుతో ఓ ప్రాజెక్ట‌ను ఆమె న‌డిపిస్తోంది. మ‌హిళ‌ల్లో పీరియ‌డ్స్ స‌మ‌యంలో ఎంత ప‌రిశుభ్రంగా ఉండాలో తెలియ‌జెప్పే క్యాంపెయిన్ అది. ఆ ప్ర‌చారం కోసం మానుషి భాగ్య‌న‌గ‌రంలో అడుగుపెట్టింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆమె దిగ‌గానే తీసుకున్న ఫోటోను పోస్టు చేసింది.

కొన్ని రోజులు హైద‌రాబాద్‌లోనే ఉంటుంద‌ట‌. ఈ సంద‌ర్భంగా మ‌రింత మంది అంద‌గ‌త్తెల‌తో క‌లిసి ప్ర‌చారంలోనూ పాల్గొంటుంద‌ట‌. ప‌నిలో ప‌ని... మ‌న సినీ ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఆమెను ఫాలో అయిపోతారేమో. త్వ‌ర‌లో ఆమె తెలుగు సినిమాలో క‌నిపించినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు