అతడిని డైలెమాలో పడేసిన మహేష్‌

అతడిని డైలెమాలో పడేసిన మహేష్‌

అర్జున్‌ రెడ్డితో సంచలనం సృష్టించిన సందీప్‌ రెడ్డి వంగా ఇంకా తన తదుపరి చిత్రం ఏమిటనేది డిసైడ్‌ అవలేదు. మహేష్‌బాబుకి ఒక కథ చెప్పాడని, మహేష్‌కి అది నచ్చడంతో చేద్దామని మాట ఇచ్చాడని టాక్‌ వుంది. అయితే మహేష్‌ ఇప్పటికే చాలా సినిమాలు కమిట్‌ అయి వున్నాడు. అతను వచ్చే ఏడాదికి కానీ ఖాళీ కాకపోవచ్చు.

ఈలోగా అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్‌ డైరెక్ట్‌ చేసే ఆఫర్‌ సందీప్‌కి వచ్చింది. దీనిని చేయాలా వద్దా అనేది అతను ఇంకా డిసైడ్‌ కాలేదు. అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్‌ అంటూ బిజీ అయిపోతే మహేష్‌తో వచ్చిన అవకాశం చేజారుతుందేమోనని అతను భయపడుతున్నాడట.

మహేష్‌ చిత్రం కోసం పకడ్బందీ కథ రెడీ చేయడానికి ఈ ఏడాదిని కేటాయించాలా లేక అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్‌కి సై అనాలా అనేది తేల్చుకోలేకపోతున్నాడట. మహేష్‌ ఏమో భరత్‌ అనే నేను తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా కమిట్‌ అయ్యాడు. త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో చేసే చిత్రం కూడా దాని వెంటనే వుంటుందనే టాక్‌ వుంది. ఈ నేపథ్యంలో మహేష్‌ అసలు సందీప్‌కి అవకాశం ఎప్పుడిస్తాడనేది చెప్పడం కష్టమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు