అవును.. శ్రీను వైట్ల సినిమా చేస్తున్నాడు

అవును.. శ్రీను వైట్ల సినిమా చేస్తున్నాడు

ఒక దర్శకుడి కెరీర్ తల్లకిందులు కావానికి రెండు మూడు సినిమాలు చాలు. ఇందుకు శ్రీను వైట్లే ఉదాహరణ. ‘బాద్ షా’ సినిమా చేసే సమయానికి శ్రీను వైట్ల టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడు. కానీ ఆ తర్వాత చేసిన మూడు సినిమాలతో పాతాళానికి పడిపోయాడు వైట్ల. ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్.. ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లయి వైట్ల కెరీర్‌ను అయోమయంలోకి నెట్టేశాయి.

‘మిస్టర్’ తర్వాత వైట్లతో సినిమా చేయడానికి స్టార్ హీరోలే కాదు.. మీడియం రేంజి హీరోలు కూడా భయపడిపోయారు. వైట్ల కెరీర్ దాదాపు క్లోజ్ అన్న ఫీలింగ్ జనాలకు వచ్చేసింది. ఇలాంటి టైంలో రవితేజతో వైట్ల సినిమా చేయబోతున్నాడంటూ ఎప్పుడో ఆరు నెలల కిందటే వార్త బయటికి వచ్చింది.

ఐతే ఇదిగో అదిగో అంటూనే నెలలకు నెలలు గడిచిపోయాయి. రవితేజ మళ్లీ వెనక్కి తగ్గాడని.. కథ కుదర్లేదని.. నిర్మాత దొరకలేదని.. ఇలా రకరకాల ఊహాగానాలు వినిపించాయి. మధ్యలో ‘రాజా ది గ్రేట్’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసి రవితేజ.. వైట్లతో సినిమా చేయబోతున్నట్లేమీ చెప్పడకపోవడంతో ఈ ప్రాజెక్టుపై సందేహాలు నెలకొన్నాయి. ఐతే ఇప్పుడా సందేహాలకు మాస్ రాజానే తెర దించేశాడు.

తన కొత్త సినిమా ‘టచ్ చేసి చూడు’ ప్రమోషన్లలో భాగంగా మళ్లీ మీడియా ముందుకొచ్చిన రవితేజ.. తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న 25 శాతం పూర్తయిందని.. దీని తర్వాత వైట్లతో సినిమా చేయబోతున్నానని స్పష్టం చేశాడు రవితేజ. మీ ఫ్రెండుని మళ్లీ నిలబెట్టడానికే ఈ చేస్తున్నారా అని అడిగితే.. ఇక్కడ ఎవరూ ఎవరికీ లైఫ్ ఇవ్వరని.. కథ బాగుంది కాబట్టే ఈ సినిమా చేస్తున్నానని చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు