గెట్ రెడీ ఫర్ సమంత ధమాకా

గెట్ రెడీ ఫర్ సమంత ధమాకా

నాగచైతన్యతో ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టాక అనుకోకుండా సమంత కెరీర్ జోరు తగ్గిపోయింది. ఆమెకు అవకాశాలు రాలేదో.. లేదా క్యారెక్టర్ల ఎంపికలో సమంతే సెలెక్టివ్‌గా తయారైందో తెలియదు కానీ.. ప్రేమ వ్యవహారం బయటికి వచ్చాక సమంత పూర్తి స్థాయి కథానాయికగా నటించిన సినిమా ఏదీ విడుదల కాలేదు. ‘రాజు గారి గది-2’.. ‘మెర్సల్’ సినిమాల్లో సమంత మెరిసింది కానీ.. అందులో ఆమెది లీడ్ రోల్ కాదు.

రెండింట్లోనూ గెస్ట్ తరహా రోల్స్ చేసింది సామ్. ఆ రకంగా 2017 సమంత అభిమానులకు నిరాశను మిగిల్చింది. ఐతే 2018 అలా ఉండబోవట్లేదు. సమంత అభిమానులకు విందు భోజనమే కాబోతోంది కొత్త ఏడాది.

ముందుగా విశాల్ సరసన సమంత నటించిన ‘ఇరుంబు తురై’ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ తర్వాత సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్లో సమంత నటించిన ‘రంగస్థలం’ విడుదలవుతుంది. దాంతో పాటే సమంత ఓ కీలక పాత్ర చేసిన ‘మహానటి’ కూడా రిలీజవుతుంది. ఇవి కాక సమంత తమిళంలో నటించిన వైవిధ్యమైన సినిమా ‘సూపర్ డీలక్స్’ కూడా సమ్మర్లోనే వస్తుంది.

ఇవి కాక సామ్ ప్రధాన పాత్రలో ‘యు టర్న్’ అనే సినిమా త్వరలోనే మొదలై ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకొస్తుంది. శివ కార్తికేయన్ సరసన కూడా సమంత ఓ సినిమాలో నటిస్తోంది. అది కూడా ఈ ఏడాదే రిలీజవుతుంది. ఇలా మొత్తంగా ఈ ఏడాదంతా సమంత ధమాకా చూడబోతున్నామన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు