బాహుబలికి కాపీ క్రీమ్ రాసేశాడుగా

బాహుబలికి కాపీ క్రీమ్ రాసేశాడుగా

బాహుబలి సిరీస్ లో పని చేసిన ప్రతీ ఒక్కరికీ విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఏళ్ల తరబడి పడిన కష్టానికి బాగానే ప్రతిఫలం అందుకున్నారు కూడా. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి కూడా ఈ చిత్రం ద్వారా బోలెడంత పేరు లభించింది.

బాలీవుడ్ లో ఎంఎం క్రీమ్ గా గుర్తింపు పొందిన కీరవాణి.. బాహుబలి మూవీకి సంగీతం అందించి.. మూవీని బాగా రక్తి కట్టించాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే అదరహో అనాల్సిందే. కానీ ఈ సంగీతం కాపీ అనే సంగతి తేల్చేస్తున్నారు జనాలు. 1949లో వచ్చిన కీలుగుర్రం చిత్రం ఇప్పటి జనాలకు అందరికీ తెలియకపోవచ్చు. అక్కినేని నాగేశ్వరరావు తన కెరీర్ ఆరంభంలో చేసిన ఈ సినిమా సూపర్ హిట్. ఈ చిత్రానికి ఘంటసాల సంగీతం అందించారు. ఈ చిత్రంలో వినిపించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను.. సేమ్ టు సేమ్ డిట్టో ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా అన్వయించేశాడు కీరవాణి.

ఆ సినిమాలోని క్లిప్పింగ్ లను షేర్ చేస్తూ.. ఈ విషయాన్ని ప్రూవ్ చేసేస్తున్నారు నెటిజనులు. బాహుబలికి ఆయువు పట్టుగా నిలిచిన ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. కీరవాణి సొంతం కాదని.. కాపీ క్రీమ్ అద్దేసి.. టచప్స్ ఇచ్చాడని జోకులు వేస్తున్నారు. ఈ కాపీ కహానీలు గత కొంతకాలంగా ఎక్కువగానే వినిపిస్తున్నా.. బాహుబలి లాంటి చిత్రానికి కూడా కాపీ కొట్టేసిన వైనం మాత్రం ఆశ్చర్యకరమే. అవును లెండి.. తనే కొన్ని సీన్స్ ను పాత సినిమాల నుంచి కాపీ కొట్టానని రాజమౌళి చెప్పినపుడు.. కీరవాణి కూడా అదే పని చేయడంలో తప్పేముంది!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు