బోయపాటిని లెక్క చేయని రామ్‌ చరణ్‌!

బోయపాటిని లెక్క చేయని రామ్‌ చరణ్‌!

రంగస్థలం చిత్రాన్ని పూర్తి చేసేసిన తర్వాత మళ్లీ రీషూట్‌ కావాలని సుకుమార్‌ రిక్వెస్ట్‌ చేయడంతో చరణ్‌ తన ప్రణాళిక మార్చుకున్నాడు. బోయపాటి శ్రీను సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సిన చరణ్‌ ఆ చిత్రం తొలి షెడ్యూల్‌కి వెళ్లలేదు. దీంతో చరణ్‌ లేకుండానే ఫస్ట్‌ షెడ్యూల్‌ని బోయపాటి శ్రీను పూర్తి చేసాడు.

రంగస్థలం చిత్రానికి ప్రత్యేకమైన గెటప్‌ ధరించిన చరణ్‌ ఆ చిత్రాన్ని కంప్లీట్‌గా ఫినిష్‌ చేసే వరకు బోయపాటి చిత్రం షూటింగ్‌కి హాజరు కానని తేల్చేసాడు. రాజమండ్రిలో రీషూట్‌ పూర్తి చేసుకుని వచ్చిన రంగస్థలం యూనిట్‌ ఇక చివరి పాట చిత్రీకరణని హైదరాబాద్‌లో పూర్తి చేసుకోనుంది. దీంతో ఈ చిత్రం షూటింగ్‌ పూర్తవుతుంది. పక్కా ప్రణాళికతో వచ్చిన బోయపాటి శ్రీనుకి మొదటి షెడ్యూల్‌ వరకు చరణ్‌ హ్యాండ్‌ ఇచ్చేయడం ఇండస్ట్రీలో టాపిక్‌ అయింది. బోయపాటిలాంటి అగ్ర దర్శకుడికి ఇలాంటి అనుభవం ఎదురు కావడం గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

అయితే బోయపాటి శ్రీనుకి చరణ్‌ వివరంగా చెప్పడమే కాకుండా చిరంజీవితో కూడా ఒక మాట చెప్పించాడట. రంగస్థలం పూర్తయిన దగ్గర్నుంచి ఫుల్‌ టైమ్‌ కేటాయిస్తానని, అనుకున్న షెడ్యూల్‌లో సినిమా పూర్తయ్యేట్టు చూస్తానని మాట ఇచ్చాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు