అనుష్కకి దూరంగా ప్రభాస్‌!

అనుష్కకి దూరంగా ప్రభాస్‌!

ప్రభాస్‌కి, అనుష్కకీ మధ్య ఏదో వుందని జాతీయ పత్రికలే కోడై కూయడంతో భాగమతి ప్రమోషన్లలో అనుష్క చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సినిమా గురించి వదిలేసి మీడియా అదే విషయంపై ప్రశ్నలు అడుగుతోంటే విసిగిపోయిన అనుష్క మీడియాని కలవడం కూడా మానేసింది.

తమ ఇద్దరి మధ్య ఏదో వుందనే పుకార్లకి ఫుల్‌స్టాప్‌ పెట్టడం కోసమే ప్రభాస్‌ కూడా 'భాగమతి'కి దూరంగా వుంటున్నాడట. తన సొంత బ్యానర్లో వచ్చిన సినిమా అయినప్పటికీ ప్రభాస్‌ మాత్రం దీనికి ఎలాంటి పబ్లిసిటీ ఇవ్వడం లేదు. తన స్నేహితుల కోసం ప్రమోట్‌ చేస్తున్నాడని కాకుండా అనుష్క కోసమే చేస్తున్నాడని టాక్‌ స్ప్రెడ్‌ అవుతుంది కనుక ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోన్న పుకార్లకి ఇక మళ్లీ ఆజ్యం పోయకుండా అనుష్క సినిమాకి ప్రభాస్‌ దూరంగా వుంటున్నాడట. అయితే భాగమతి పెద్ద హిట్‌ అయి ఇంకా స్టడీ కలక్షన్లతో రన్‌ అవుతోన్న నేపథ్యంలో ఈ చిత్ర విజయోత్సవాన్ని భారీగా ప్లాన్‌ చేస్తోంది యువి క్రియేషన్స్‌.

మరి దానికి కూడా ప్రభాస్‌ డుమ్మా కొడతాడా లేక ముఖ్య అతిథిగా వచ్చి తన స్నేహితుల కోసం తన వంతు మాట సాయం చేసేస్తాడా అనేది చూడాలి. ఆల్రెడీ బ్రేక్‌ ఈవెన్‌ అయిపోయిన భాగమతి ఇప్పటికీ మంచి వసూళ్లు అంతటా సాధిస్తోంది. ఈమధ్య కాలంలో ఫ్యామిలీ ఆడియన్స్‌ కనక్ట్‌ అయిన సినిమా ఇదేనట. ఎంసిఏ తర్వాత మళ్లీ థియేటర్లు కళ కళలాడుతున్నాయని మార్కెట్‌ వర్గాలు సంబరంగా వున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు