త్రివిక్రమ్‌ భయపడ్డాడండోయ్‌!

త్రివిక్రమ్‌ భయపడ్డాడండోయ్‌!

దర్శకుడిగా తన పేరు, మరో పెద్ద స్టారు వుంటే సినిమాలకి క్రేజ్‌ ఆటోమేటిగ్గా వస్తుందనే సూత్రాన్ని నమ్మిన త్రివిక్రమ్‌ 'అజ్ఞాతవాసి' ఎఫెక్టుతో దారికొచ్చేసాడు. పవన్‌కళ్యాణ్‌ పక్కన కీర్తి సురేష్‌, అను ఎమాన్యుయేల్‌ లాంటి స్టార్‌డమ్‌ లేని హీరోయిన్లని పెట్టిన త్రివిక్రమ్‌ ఈసారి ఆ తప్పు చేయబోవడం లేదు.

తన తదుపరి చిత్రంలో ఎన్టీఆర్‌ పక్కన ఒక క్రేజీ హీరోయిన్‌ వుండాలని త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. తన సినిమాల్లో ఇలియానా, సమంత లాంటి స్టార్‌డమ్‌ వున్న హీరోయిన్లనే ఎక్కువగా పెట్టుకున్న త్రివిక్రమ్‌ 'అజ్ఞాతవాసి'కి వచ్చేసరికి హీరోయిన్‌దేమీ లేదని అనేసుకున్నాడు. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్టు ఆ సినిమా ఘోర పరాజయంలో హీరోయిన్లకీ పెద్ద షేరే దక్కింది. దీంతో ఎన్టీఆర్‌తో సినిమాకి హీరోయిన్ల బడ్జెట్‌ పరంగా తక్కువ కేటాయించడానికి త్రివిక్రమ్‌ ఇష్టపడడం లేదు.

కాస్త ఖర్చు ఎక్కువైనా ప్రాజెక్టుకి క్రేజ్‌ తెచ్చే హీరోయిన్‌నే పెట్టాలని చూస్తున్నాడు. త్రివిక్రమ్‌ ఎవరిని ఫైనలైజ్‌ చేస్తాడనేది ఇంకా తెలియదు కానీ అన్ని విషయాల్లోను 'గురూజీ' జాగ్రత్త పడుతూ వుండడం చూసి తారక్‌ అభిమానులు కాస్త ఉపశమనం ఫీలవుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు