మళ్ళీ అదే తప్పు చేస్తోన్న టాలీవుడ్‌

మళ్ళీ అదే తప్పు చేస్తోన్న టాలీవుడ్‌

ఏదైనా సెలవు రోజు కలిసి వస్తుందని అంటే ఆ వారంలో పోటీ పడి చాలా సినిమాలు రిలీజ్‌ చేయడం రివాజుగా మారింది. ఈ పద్ధతి బెడిసికొట్టినా కానీ ఎవరికి వారు హాలిడేని క్యాష్‌ చేసుకుందామని తమ సినిమాపై అచంచలమైన నమ్మకంతో ఉత్సాహం చూపిస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 15 వీకెండ్‌ కోసమని మూడు సినిమాలు పోటీ పడితే నేనే రాజు నేనే మంత్రి తప్ప మిగతావి ఫెయిలయ్యాయి.

జయ జానకీ నాయక అయితే మంచి టాక్‌తోను హిట్‌ కాలేకపోయింది. అలాగే క్రిస్మస్‌ హాలిడేకి ఎంసిఏ, హలో పోటీ పడితే అఖిల్‌ సినిమాకి చుక్కెదురైంది. దసరా, సంక్రాంతి మినహా మల్టిపుల్‌ సినిమాలని మోసే శక్తి తెలుగు సినిమా బాక్సాఫీస్‌కి లేదు. అయినప్పటికీ ఇప్పుడు శివరాత్రి హాలిడే కోసం నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. తొలిప్రేమ, ఇంటిలిజెంట్‌, గాయత్రి, కిరాక్‌ పార్టీలు రెండు రోజుల వ్యవధిలో రిలీజ్‌ అవుతున్నాయి. శివరాత్రికి కలిసి వచ్చే ఒక్క రోజు మినహా ఇది గొప్ప డేట్‌ ఏమీ కాదు.

పైగా ఈవారానికి ముందు ఒక రెండు సినిమాలు, తర్వాతి వారం మరో మూడు సినిమాలు వస్తున్నాయి. ఎందుకని ఇలా స్ట్రాటజీ లేకుండా పోటీ పడుతున్నారనేది ట్రేడ్‌ పండితులకే బోధ పడడం లేదు. అయితే వీరిలో చాలా మంది నిర్మాతలు ఈగోలకి పోయి పక్కవారితో కయ్యానికి కాలు దువ్వుతున్నారని మాత్రం పరిశ్రమలో చెవులు కొరుక్కుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు