చరణ్‌ కోసం జగన్‌ వ్యూహం

చరణ్‌ కోసం జగన్‌ వ్యూహం

ఒకప్పుడు స్టార్‌ హీరోలంతా మాతో సినిమా చేయండంటే మాతో చేయమంటూ వెంటపడిన పూరి జగన్నాథ్‌కి ఇప్పుడు బేరాల్లేవు. పైసా వసూల్‌ డిజాస్టర్‌ అవడంతో పూరి జగన్నాథ్‌తో పని చేసే హీరోలు లేకుండా పోయారు. దాంతో ఇప్పుడు తనయుడిని హీరోగా లాంఛ్‌ చేసే పనిలో బిజీగా వున్న పూరి దాని తర్వాత చేసే సినిమాపై ఇప్పట్నుంచే కసరత్తులు మొదలు పెట్టాడు.

ఒక స్టార్‌ హీరోతో కనుక సినిమా కమిట్‌ అయినట్టయితే ఇప్పుడు చేస్తోన్న తనయుడి చిత్రానికి క్రేజ్‌ వస్తుంది. వెనక వున్న సినిమా కోసమైనా బయ్యర్లు దీనిని కొనేందుకు ముందుకొస్తారు. అందుకే ఎవరైనా పెద్ద స్టార్‌ని పట్టాలని పూరి సీరియస్‌గా ట్రై చేస్తున్నాడు. 'చిరుత'తో చరణ్‌ని లాంఛ్‌ చేసిన పూరికి మరో సినిమా చేస్తామని అప్పట్లోనే చిరు, చరణ్‌ మాట ఇచ్చారట. అయితే ఆ తర్వాత పూరితో కలిసి పని చేసే వీలు కుదర్లేదు. ఈలోగా పూరి ఫామ్‌ కోల్పోవడంతో ఇక ఆ ప్రాజెక్ట్‌ మెటీయరలైజ్‌ అవలేదు. ఇప్పుడు తనతో సినిమా చేసి పెట్టాలని చరణ్‌ని పూరి కోరుతున్నాడట.

చరణ్‌ ఆ సినిమా చేసినా చేయకపోయినా, పూరితో సినిమా వుందని చెబితే 'మెహబూబా' చిత్రానికి హెల్ప్‌ అవుతుంది. బోయపాటితో సినిమా తర్వాత రాజమౌళితో మల్టీస్టారర్‌ చేస్తోన్న చరణ్‌ కనీసం 2020 వరకు కొత్త సినిమా మొదలు పెట్టే వీల్లేదు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు