ఒక రోజు వెనక్కెళ్లిన వరుణ్

ఒక రోజు వెనక్కెళ్లిన వరుణ్

ఈ మధ్య కాలంలో పోటాపోటీగా సినిమాలు రావడం సహజం అయిపోయింది. అయినా సరే ఫిబ్రవరి 9 డేట్ పై టాలీవుడ్ జనాల్లో ఆసక్తి బాగానే కనిపించింది. ఇందుకు కారణం ఒకే రోజున వచ్చేస్తామంటూ ఇద్దరు మెగా హీరోలు పట్టు పట్టడమే. సాయి ధరం తేజ్ నటించిన ఇంటెలిజెంట్.. వరుణ్ తేజ్ మూవీ తొలిప్రేమ చిత్రాలు ఫిబ్రవరి 9నే వచ్చేయాలని ఫిక్స్ అయిపోయాయి.

ముందు ఇలాగే అనుకున్నా.. చివరకు ఏదో ఒకటే వస్తుందని అంతా భావించారు. మెగా ఫ్యాన్స్ కూడా అదే ఫీలింగ్ తో ఉన్నారు. కానీ సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేసినా ఏ సినిమా కూడా తగ్గకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో నిర్మాతల మధ్య సర్దుబాటు చేసేందుకు గట్టి ప్రయత్నాలే జరగగా.. ఎట్టకేలకు వరుణ్ తేజ్ మూవీ మేకర్స్ ఒక రోజు వెనక్కి వెళ్లేందుకు అంగీకరించారట. అయితే తొలిప్రేమ వెనక్కు వెళ్లడంపై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. కానీ ఒకటి రెండు రోజుల్లోనే సినిమాకు మరో ప్రమోషనల్ మెటీరియల్ ఏదైనా ఇచ్చి.. ఆ సందర్భంలోనే రిలీజ్ డేట్ మార్పు విషయాన్ని ప్రకటించాలని నిర్ణయించారట.

ఇప్పుడు ఫిబ్రవరి 9న ఇంటెలిజెంట్ రిలీజ్ ఖాయం కాగా.. ఫిబ్రవరి 10 వరుణ్ తేజ్ సినిమా తొలి ప్రేమ వస్తుందన్న మాట. ముందే వస్తున్న ఇంటెలిజెంట్ ది పై చేయిగా కనిపిస్తున్నా.. ఒక రోజు ఆలస్యంగా అయినా శనివారం వస్తున్న తొలిప్రేమ మేకర్స్ దే ఇంటెలిజెంట్ స్టెప్ అనే టాక్ వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు