తమన్ బాబూ.. ఎవరికి న్యాయం చేశావ్?

తమన్ బాబూ.. ఎవరికి న్యాయం చేశావ్?

ఒక టెక్నీషియన్ వర్క్ చేసిన సినిమాలు.. ఒకేసారి మూడు రిలీజ్ కావడం ఆసక్తి కలిగించే విషయమే. మ్యూజిక్ వంటి మెయిన్ క్రాఫ్ట్ విషయంలో ఇలాంటి సందర్భాలు తక్కువగానే ఉంటాయి. ఫిబ్రవరి 9న నాలుగు సినిమాలు విడుదల అవుతుండగా.. ఇందులో మూడింటికి మ్యూజిక్ డైరెక్టర్ ఒకటే కావడం గమనించాలి.

వరుణ్ తేజ్ మూవీ తొలిప్రేమ.. సాయిధరం తేజ్ సినిమా ఇంటిలిజెంట్.. మోహన్ బాబు నటించిన గాయత్రి చిత్రాలకు తమన్ సంగీతం అందించగా.. ఈ 3 ఒకే రోజున విడుదల అవుతున్నాయి. అంటే.. మూడు సినిమాల్లో ఏది బాగా ఆడినా.. తమన్ పేరు మరోసారి మారుమోగిపోతుందన్న మాట. మరి ఈ మూడింటిలో తమన్ ఏ చిత్రానికి న్యాయం చేశాడన్నదే పాయింట్. వరుణ్ తేజ్ మూవీ తొలిప్రేమ ఆల్బమ్ మొత్తానికి మంచి పేరు వచ్చింది. ప్రేమ కథతో తెరకెక్కిన చిత్రానికి.. తమన్ అందించిన మ్యూజిక్ ప్రాణం పోసినట్లే కనిపిస్తోంది.

ఇక మాస్ కం మేథస్సు మిళితంగా వస్తున్న ఇంటిలిజెంట్ చిత్రానికి తమన్ ఇచ్చిన సంగీతం బాగానే ఉంది. రెండు పాటలకు మంచి గుర్తింపే వచ్చింది. మోహన్ బాబు సినిమా గాయత్రిలో ఒక పాటకు స్పందన అదిరిపోయింది. ఈ రెండు సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అవుతుందనే సంగతి అర్ధమవుతూనే ఉంది. అయితే.. ఈ మూడు సినిమాల షూటింగ్ షెడ్యూల్ ఎక్కువ కాలమే కొనసాగడంతో.. వీటిపై పర్ఫెక్ట్ గా వర్క్ చేసేందుకు తగినంత సమయమే తమన్ కు లభించిందని.. అన్ని సినిమాలకు ఆకట్టుకునే మ్యూజిక్ ఇచ్చాడని సన్నిహితులు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు