మ‌రి న‌య‌న్‌కు ఎట్టా సెట్ట‌వుద్దో

మ‌రి న‌య‌న్‌కు ఎట్టా సెట్ట‌వుద్దో

క‌మ‌ల్ హాస‌న్‌ను భార‌తీయుడు సినిమా ఒక లెవెల్లో నిల‌బెట్టింది. ఆ సినిమా త‌రువాత కేవ‌లం త‌మిళులే కాదు... భార‌త‌దేశ‌మే క‌మల్ అభిమాని అయిపోయింది. ఇప్పుడు త్వ‌ర‌లో ఆ సినిమా సీక్వెల్ రాబోతోంద‌ట‌. ఎవ‌రో కాదు... రోబో 2.0 శంక‌రే ఆ సినిమాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఈ విష‌యాన్ని గాలిలో బెలూన్లు ఎగుర‌వేసి మ‌రీ ప్ర‌క‌టించారు. ఇక ఇందులో హీరోయిన్ గా న‌య‌న తార‌ను సంప్ర‌దిస్తున్నార‌ట‌. కానీ న‌య‌న్ విష‌యంలో కాస్త చిక్కు ఉంది. అదేంటంటే...

మూడు, నాలుగు ల‌వ్ ఫెయిల్యూర్ల త‌రువాత ఏమైంతో కానీ... న‌య‌న్ కొన్ని కండిష‌న్లు పెడుతోంది. త‌న‌ను హీరోలు ముట్టుకోకూడ‌ద‌ని చెబుతోంది. కానీ అదెలా సాధ్యం అని చెవులు కొరుక్కుంటున్నారు సినీ జ‌నాలు. అయితే ఆ మధ్యన బాలయ్య సినిమా జైసింహ కు అదే కండిషన్ పెట్టింది. అందుకే సినిమాలో ఇద్దరి మధ్యనా టచ్చింగ్ సీన్ ఏదీ ఉండదు. ఇకపోతే భారతీయుడు 2 విషయానికి వస్తే.. అస‌లే క‌మ‌ల్ హాస‌న్ సినిమాలో ముట్ట‌కోవ‌డాలు, ప‌ట్టుకోవ‌డాలు ఎక్కువే ఉంటాయి. ముద్దు సీన్లు, కౌగిలింత‌లు వంటి రొమాంటిక్ సీన్లు లేకుండా క‌మ‌ల్ సారూ సినిమా చేయ‌రు. మ‌రి ఆ సినిమాలో న‌య‌న్ కు క‌మ‌ల్ సినిమా ఎట్టా సెట్ట‌వుద్ది? అని కోలీవుడ్లో గుసగుస‌లు ఎక్కువ‌వుతున్నాయ్‌.

న‌య‌న‌తార కూడా ఈ సినిమాకు దాదాపు ఓకే చెప్పేసిన‌ట్టేన‌ని సమాచారం. ఇక అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి. భార‌తీయుడు సినిమాలో సుకన్య లాగే న‌య‌న్ కూడా విప్ల‌వం ట‌చ్ ఉన్న పాత్ర చేస్తుంద‌ట‌. ఈ సినిమాలో ఒక కీల‌క‌పాత్ర‌లో వ‌డివేలు న‌టిస్తున్నాడ‌ట‌. రోబో 2.0 విడుద‌ల అయ్యాక ఈ సినిమా సెట్స్ మీద‌కి వెళ్లే అవ‌కాశం ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు