నిర్మాత నాని.. డేట్ ఫిక్స్ చేసుకున్నాడు

నిర్మాత నాని.. డేట్ ఫిక్స్ చేసుకున్నాడు

ఇంతకుముందు ‘డి ఫర్ దోపిడీ’ అనే సినిమాలో నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు నాని. ఐతే ఆ సినిమాలో ముందు నుంచి అతడి ఇన్వాల్వ్‌మెంట్ లేదు. చివర్లో వచ్చి జాయిన్ అయ్యాడు. అది కూడా నామమాత్రంగానే. కాబట్టి నిర్మాతగా నానికి పూర్తి స్థాయిలో అదే తొలి సినిమా కాదు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ అనే కొత్త దర్శకుడితో ‘అ’ అనే సినిమాతో నాని ఫుల్ లెంగ్త్ ప్రొడ్యూసర్ అవుతున్నాడు. ఈ సినిమా టైటిల్ ప్రకటించిన దగ్గర్నుంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. దీని ప్రోమోలు భలే వెరైటీగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఇప్పటికే దీని టీజర్ కూడా వచ్చేసింది. ట్రైలర్ కూడా జనవరి 31న వచ్చేయబోతోంది.

పనిలో పనిగా సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. ఫిబ్రవరి 16న ‘అ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘‘సినిమాలందు ‘అ’ సినిమా వేరయగా.. విశ్వదాబి రామా ఫిబ్రవరి 16న రిలీజ్ రా మామా’’ అంటూ వేమన పద్యాన్ని మార్చి రాసి సినిమా రిలీజ్ డేట్‌ను విభిన్న రీతిలో అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 16 కోసం ఆల్రెడీ కృష్ణ కూతురు మంజుల తీసిన ‘మనసుకు నచ్చింది’ షెడ్యూల్ అయి ఉంది.

దానికి పోటీగా ‘అ’ను దింపుతున్నారు. కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా కసాండ్రా, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి, మురళీ శర్మ, ఈషా రెబ్బా లాంటి చాలామంది తారల కలయికలో తెరకెక్కిన ‘అ’ మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ వెరైటీ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నందిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English