పవన్‌తో సినిమానా.. అయ్యబాబోయ్

పవన్‌తో సినిమానా.. అయ్యబాబోయ్

‘సర్దార్ గబ్బర్ సింగ్’ కోసం టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలిచ్చిన పవన్ కళ్యాణ్.. తాను తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆ సినిమాకు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే రాసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. తన దగ్గరికి దర్శకులు, రచయితలు రావట్లేదని.. దీంతో తానే పెన్ను పట్టాల్సి వచ్చిందని చెప్పాడు. పవర్ స్టార్ లాంటి హీరోకు దర్శకులు, రచయితల కొదవా అని అంతా అప్పుడు ఆశ్చర్యపోయారు. కానీ గత కొన్నేళ్లలో పవన్‌తో సినిమాలుచేసిన వాళ్ల పరిస్థితి చూస్తే మాత్రం దర్శకులు ఆయనతో సినిమా చేయడానికి వెనుకంజ వేయడంలో ఆశ్చర్యం లేదనిపిస్తుంది.

‘సర్దార్ గబ్బర్ సింగ్ విషయానికే వస్తే.. ఈ సినిమా కోసం పవన్ పిలుపు మేరకు రెండేళ్లు పని చేశాడు సంపత్ నంది. కానీ చివరికి అతడికి గుడ్ బై చెప్పేశాడు. రెండేళ్ల విలువైన సమయాన్ని కోల్పోయాడు సంపత్.

తర్వాత ‘పవర్’ లాంటి హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన బాబీకి ‘సర్దార్’ బాధ్యతలు అప్పగించాడు. అతనేమీ ఈ సినిమాలో పెద్దగా ఇన్వాల్వ్ అయినట్లు కనిపించలేదు. ఈ సినిమాకు పవనే అన్నీ తానై వ్యవహరించాడు. కానీ సినిమా ఫెయిల్యూర్ తాలూకు ఫలితాన్ని బాబీ కొంత వరకు అనుభవించాల్సి వచ్చింది. ఇక పవన్‌తో ‘కాటమరాయుడు’ తీసిన డాలీ పరిస్థితేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

చివరికి త్రివిక్రమ్ సైతం పవన్‌తో సినిమా చేసి కెరీర్లో ఎన్నడూ లేనంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. మరోవైపు తమిళంలో ‘జిల్లా’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన నేసన్ పవన్ కోసం దాదాపు రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు. చివరికి రత్నం నిర్మాణంలో పవన్ హీరోగా అతను చేయాల్సిన సినిమా సంగతి ఎటూ తేలలేదు. అతడి కెరీర్లో విలువైన సమయం వృథా అయింది. ఇంకోవైపు ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ కూడా మైత్రీ వాళ్లతో పవన్ సినిమా చేస్తాడని భావించి స్క్రిప్టు రెడీ చేసుకుని కూర్చున్నాడు. ఆ సినిమా సంగతీ తేలట్లేదు. మొత్తంగా చూస్తే పవన్‌ను నమ్మి ఇలా చాలా మంది దర్శకుల కెరీర్లు తారుమారైపోతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English