జీఎస్టీ ప్రియులకు వర్మ కానుక

జీఎస్టీ ప్రియులకు వర్మ కానుక

జీఎస్టీ అంటే ఏంటి అని నెల రోజుల ముందు ఎవరిని అడిగినా.. ‘గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్’ అనే వాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం జనాలు.. ముఖ్యంగా కుర్రకారు జీఎస్టీ అంటే ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ అంటున్నారు. పోర్న్ స్టార్ మియా మాల్కోవాను పెట్టి తాను తీసిన ‘జీఎస్టీ’తో అంతగా సంచలనం సృష్టించాడు రామ్ గోపాల్ వర్మ.

ఒక సినిమా ఎలా తీసినా దాన్ని తనదైన శైలిలో పబ్లిసిటీ చేసి.. జనాల్లోకి తీసుకెళ్లడంలో వర్మ స్టయిలే వేరని ‘జీఎస్టీ’ మరోసారి రుజువు చేసింది. వర్మ తీసిన సినిమా విషయంలో ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. ఇది అనూహ్యమైన స్పందన తెచ్చుకున్న మాట వాస్తవం.

ఈ స్పందన చూసి షేకైపోయిన వర్మ.. ‘జీఎస్టీ’కి కొనసాగింపుగా ఇంకో సినిమా తీయబోతున్నట్లు ప్రకటించాడు. ఇందుకు దేవుడి కృప ఉండాలంటూ సెటైరిగ్గా ఒక ట్వీట్ కూడా పెట్టాడు. ఐతే ‘జీఎస్టీ’లో మియా మాల్కోవాను అణువణువునా చూపించేసిన వర్మ.. ఇక ఆమె అందాల్ని కొత్తగా ఏం చూపిస్తాడు.. ఏం ఫిలాసఫీ చెబుతాడన్నది ఆసక్తికరం.

బహుశా ఈసారి మియాకు టాటా చెప్పేసి వేరే అమ్మాయితో సినిమా తీస్తాడమో. కానీ మియా లాగా ఇంకొకరు వర్మకు ఆ స్థాయిలో సహకరిస్తారేమో చూడాలి. బహుశా నాగార్జునతో తీస్తున్న సినిమా పూర్తయ్యాక ‘జీఎస్టీ-2’ మీద దృష్టి పెడతాడేమో వర్మ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు