ఫొటో స్టోరీ: సొగసు చూడతమరమా!

ఫొటో స్టోరీ: సొగసు చూడతమరమా!

రెజీనాకు తెలుగులో సినిమాలు తగ్గిపోయాయి. ఆమె దాదాపుగా తెలుగు తెర నుంచి కనుమరుగయ్యే పరిస్థితి వచ్చేసింది. అంత మాత్రాన రెజీనా అభిమానులు అంత సులువుగా ఆమెను మరిచిపోగలరా? ఆమె వేసిన అందాల వల నుంచి బయటికి రాగలరా? ఐతే ఆమె కేవలం తన అందంతో మాత్రమే అభిమానుల్ని సంపాదించుకోలేదు. అభినయంతోనూ మెప్పించింది. అందం.. అభినయం రెండూ కలగలిసిన అరుదైన హీరోయిన్లలో ఆమె ఒకరు. కానీ ఒక స్టార్ కథానాయిక కావడానికి అవసరమైన అన్ని లక్షణాలూ ఉన్నా.. ఒక దశ దాటి ఎదగలేకపోయింది ఈ చెన్నై సుందరి.

హీరోయిన్లకు సినిమాల ఎంపికలో ఛాయిస్‌లు తక్కువ. చేతికొచ్చిన ప్రతి సినిమానూ ఒప్పేసుకోవాల్సిందే. రెజీనా కూడా అలాగే ఒప్పుకుంది. అవి తేడా కొట్టాయి. ఆమె కెరీర్ దెబ్బ తింది. అయినప్పటికీ రెజీనా ఫాలోవర్లు ఆమెను విడిచిపెట్టేయలేదు. ఎక్కడైనా రెజీనా అందంతో మెరిసిపోతే సోషల్ మీడియాలో ఆ ఫొటోలు వైరల్ అయిపోతుంటాయి. తాజాగా రెజీనా చేసిన ఒక ఫొటో షూట్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రెజీనా ది బెస్ట్ లుక్ ఈ షూట్లో చూడొచ్చు. పెద్దగా అందాల ప్రదర్శన చేయకపోయినా క్యూట్ అండ్ హాట్ అనిపిస్తోంది రెజీనా ఇందులో. త్వరలోనే ‘అ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెజీనా.. మళ్లీ ఓ మంచి విజయాన్నందుకుని తెలుగులో బిజీ అవుతుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు