మెగా యుద్దం కాదది ప్రొడ్యూసర్ల యుద్దం

మెగా యుద్దం కాదది ప్రొడ్యూసర్ల యుద్దం

మెగా హీరోలు వ‌రుణ్ తేజ్‌... సాయి ధ‌ర‌మ్ తేజ్ ల సినిమాలు త్వ‌ర‌లో ఒకే తేదీన విడుద‌ల కానున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఈ హీరోలు ఇలా ఒకేరోజున ఎందుకు విడుద‌ల పెట్టుకున్నారు? ఒక‌రితో ఒక‌రు ఎందుక‌లా పోటీ ప‌డుతున్నారు? ఇలా చాలా మందికి అనిపించింది. అయితే తెలిసిన స‌మాచారం ప్ర‌కారం... పోటీ వాళ్ల మ‌ధ్య‌న కాదు, వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఏ గొడ‌వా లేదు. గొడ‌వంతా... ఆ సినిమాల నిర్మాతల మ‌ధ్యేన‌ట‌.

వ‌రుణ్ తేజ్ సినిమా తొలిప్రేమ‌. నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్‌. అయితే ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న‌ది మాత్రం దిల్ రాజు. ఇక సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమా ఇంటెలిజెంట్‌. నిర్మాత సి కళ్యాణ్‌. ఈ రెండు సినిమాలు ఫిబ్ర‌వ‌రి 9నే విడుద‌ల‌వ్వ‌బోతున్నాయ్‌. మెగా ఫ్యాన్స్ కు ఇది మింగుడు ప‌డని విష‌యంగా మారింది. కానీ దిల్ రాజు కానీ, క‌ళ్యాణ్ కానీ వెన‌క్కి త‌గ్గేట్టు క‌నిపించడం లేదు. క‌ళ్యాణ్ అయితే మ‌రీ మొండిగా ఆ రోజే విడుద‌ల చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాడ‌ట‌. ఎందుకంటే తొలిప్రేమ క్లాస్ మూవీ. త‌మ మాస్ మ‌సాలా ఎంట‌ర్ టైన్ మెంట్ ఇంటెలిజెంట్ ముందు తొలిప్రేమ నిల‌బ‌డ‌లేద‌ని భావిస్తున్నాడ‌ట క‌ళ్యాణ్‌. అందుకు జై సింహా సినిమానే ఉదాహ‌ర‌ణ‌గా చెబుతున్నాడ‌ట‌.

ఈ విష‌యంలో మ‌రో టాక్ కూడా వినిపిస్తోంది. క‌ళ్యాణ్ కావాల‌నే దిల్ రాజు పోటీకి దిగుతున్నాడ‌ని అంటున్నారు సినీ జ‌నాలు. గ‌తంలోని కొన్ని లావాదేవీల విష‌యంలో కావాల‌నే ఇలా చేస్తున్నాడ‌ని కూడా టాక్ ఉంది. కనుక ఈ రెండు సినిమా ఫైటింగ్‌ను ఎవ్వ‌రూ ఆప‌లేరు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English