రోబో సినిమాకు ఉయ్యాలవాడ టచ్

రోబో సినిమాకు ఉయ్యాలవాడ టచ్

ర‌జినీ త‌మిళ సినీ ఇండ‌స్ట్రీకి దేవుడైతే... ఇక్క‌డ చిరుది దాదాపు అదే స్థాయి.  వాళ్లిద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం కూడా ఉంది. ర‌జినీ ఆహ్వానాన్ని ఏనాడు చిరు కాద‌న‌లేదు. ఇప్పుడు కూడా అదే జ‌రుగుతుంద‌నుకుంటున్నారు సినీ జ‌నాలు. త్వ‌ర‌లో ర‌జినీ, చిరుల‌ను ఒకే వేదిక‌పై చూడ‌బోతున్నామ‌ట‌.

ర‌జినీ, చిరు ఇద్ద‌రూ షూటింగ్‌ల‌తో బిజీగానే ఉన్నారు. వారిద్ద‌రూ న‌టిస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీలు ట్రాక్ మీదే ఉన్నాయి. ర‌జినీ రోబో 2.0తో మ‌న ముందుకు వ‌స్తుంటే... చిరు సైరాలో ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగా క‌నిపించ‌నున్నాడు. సైరా విడుద‌ల‌కు చాలా స‌మ‌యం ప‌డుతుంది కానీ, 2.0  మాత్రం త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఈ సినిమా టీజ‌ర్ లాంచ్ హైద‌రాబాద్‌లో ఉండ‌బోతోంది. చాలా గ్రాండ్ ఆ ఈవెంట్‌ను చేయ‌బోతున్నార‌ట శంక‌ర్ టీమ్‌. అందుకు తెలుగు, మ‌ళ‌యాళ‌, త‌మిళ సూప‌ర్ స్టార్ల‌ను ఆహ్వానిస్తార‌ని టాక్ వ‌చ్చింది. త‌మిళ‌, మ‌ళ‌యాళ సంగ‌తి ప‌క్క‌న పెడితే... తెలుగు మాత్రం మ‌న మెగాస్టార్‌ను ఆహ్వానించింద‌ట చిత్ర యూనిట్‌.

టీజ‌ర్ లాంచ వేడుక తేదీ బ‌య‌టికి ఇంకా ప్ర‌క‌టించ‌లేదు కానీ... చిరంజీవికి మాత్రం చెప్పింద‌ట రోబో 2.0 చిత్ర యూనిట్‌. ఆ రోజున హైద‌రాబాద్‌లో జ‌రిగే వేడుక‌కు త‌ప్ప‌కుండా హాజ‌రవ్వాల‌ని కోరింద‌ట‌. గ‌తంలో జ‌రిగిన రోబో ఈవెంట్‌కు కూడా చిరు పాల్గొన్నారు. సో ఈసారి కూడా ఖ‌చ్చితంగా పాల్గొంటార‌ని అంటున్నారు సినీ జ‌నాలు. పైగా ఈ మధ్యన ప్రతీ ఈవెంటుకు చిరంజీవిని ఆహ్వానించి ఆయన టచ్ ఇప్పించడం సర్వసాధారణం అయిపోయింది. మరి ఉయ్యాలవాడ సినిమా పనుల్లో బిజీగా ఉన్న చిరంజీవి కూడా.. వస్తాననే చెప్పారు. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English