రామయ్య శాంపిల్‌, రభసలో బీభత్సం

రామయ్య శాంపిల్‌, రభసలో బీభత్సం

రామయ్య వస్తావయ్యా టీజర్‌ చూసినవారందరూ ఆ బుడ్డోడు డైలాగ్‌ గురించి చర్చించకుండా ఉండరు. నిన్ని రాత్రి జరిగిన ఎన్టీఆర్‌ బర్త్‌డే పార్టీలో కూడా అందరూ అదే డైలాగ్‌ గురించి తెగ మాట్లాడుకున్నారట. అయితే ఆ డైలాగును తన ఫ్యామిలీలోని కొంతమందిపై, ఒక మీడియా సంస్థపై ఎక్కుపెట్టాడని ఇప్పటికే చాలా రూమర్లు ఫిలిం నగర్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

అయితే రామయ్య వస్తావయ్యాలో ఇలాంటి పొలిటికల్‌ డైలాగ్స్‌ ఒక మోతాదులోనే ఉంటాయి కాని, ఆ తరువాత వచ్చే రభస సినిమాలో మాత్రం రచ్చ రచ్చ చేస్తాడట యంగ్‌ టైగర్‌. ప్రస్తుతం రభసకు సంబందించి చాలా డైలాగులను వండే పనిలో పడ్డాడు దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌. ఈ సినిమాలో తన ప్రత్యర్ధులందరుకూ తన విశ్వరూపం చూపించాలని ఎన్టీఆర్‌ ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నారు.

అయితే మనోడు చేతిలో సినిమా ఉంది కదా అని ఇలా కోటింగ్‌ ఇచ్చుకుంటూపోతే, సదరు మీడియాలు కూడా మనోడికి ఇలాంటి కోటింగే ఇవ్వాలని స్కెచ్‌ వేస్తున్నారు. మరి రెండు పార్టీలూ రాజీకొస్తాయా లేకపోతే బీభత్సం సృష్టిస్తాయో తెలియాలంటే, వేచిచూడాల్సిందే!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు