#MeTooRGV.. నిజం కాదు కదూ!!

#MeTooRGV.. నిజం కాదు కదూ!!

రామ్ గోపాల్ వర్మ... సినీ జనాలకు పరిచయం అక్కర్లేని పేరు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అసలు ఆర్జీవీ పుట్టాకే వివాదాలు పుట్టాయా అన్నంతగా పాపులర్ అయిపోయాడు గురుడు. ఇదీ అదీ అని లేదు... ఏ అంశం మీదైనా సెటైర్లు వేసేస్తాడు. పోర్న్ చూస్తానంటూ ధైర్యంగా బయటికే చెబుతాడు. సెక్స్ లేకుండా బతకలేనంటాడు. పేరున్న ఏ భారతీయ దర్శకుడు చేయని పనిని చేసి ఇప్పటికే సంచలనం  సృష్టించాడు. గాడ్ సెక్స్ ట్రూత్ పేరుతో పోర్న్ సినిమాను తీసి, కొత్త వివాదంలోనూ చిక్కుకున్నాడు.

ఆర్జీవీ హోమో సెక్సువల్ అని అతని దగ్గర పనిచేసిన జయకుమార్ అనే రైటర్ బాంబు పేల్చాడు. అంతేకాదు... హాలీవుడ్లో హార్వే వీన్ స్టీన్ ఎలా అయితే... సినిమా అవకాశాలను ఇస్తానంటూ హీరోయిన్లను లైంగికంగా వేధించాడో... బాలీవుడ్లో వర్మ కూడా అదే బాపతని ఆరోపించాడు. నోరిప్పితే సెక్స్ గురించి సిగ్గు పడకుండా మాట్లాడే... వర్మ నిజంగానే సెక్స్ ప్రిడేటరా? హార్వేలాగే సినిమాలలో అవాకాశాలు పేరుతో అమ్మాయిలను లైంగికంగా వేధించాడా? ఏమో అవన్నీ నిజాలో కాదో ఇంకా తెలియదు.

ఒకవేళ నిజమే అనుకుంటే... పాతికేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతనిపై ఇంతవరకు ఒక్క హీరోయిన్ కానీ, నటి కానీ ఎందుకు ఫిర్యాదు చేయలేదు. అలాంటి విషయాలు బయటపెడితే తన పరువే పోతుందని ఊరుకుందా? లేక వర్మ తన హీరోయిన్లను మాత్రం టచ్ చేయని శ్రీరామచంద్రుడా? వంటి ప్రశ్నల్నీ ఇప్పుడు చాలామంది సినీప్రియుల మదిని తొలచేస్తున్నాయి. కాని తాజాగా రైటర్ జయకుమార్ ఇచ్చిన పిలుపు మేరకు వర్మపై #MeTooRGV ఉద్యమం చేపడితే... ఎవరన్నా బాధితులు ఒకవేళ ఒక్కొక్కరిగా బయటికి వచ్చి వర్మ మరో కోణాన్ని బయటపెట్టడం జరిగితే... దాదాపు వర్మ కెరీర్ అక్కడితే ముగిసినట్టేనని అంటున్నారు ఫిల్మ్ నగర్ వాసులు.

భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక పేజీని రాసుకున్నాడు ఆర్జీవీ. కానీ అతను ‘హార్వే వీన్ స్టీన్ ఆఫ్ బాలీవుడ్’అని నిరూపణ అయితే మాత్రం ఆ పేజీ చిరిగిపోవడం ఖాయం. వర్మ అటువంటి దర్శకుడు కాదని.. కాకూడదనే ఆశిద్దాం. ఎంతోమందికి మార్గదర్శం చూపించే వర్మ అంటేనే మనకు ఇష్టం. కాదంటారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు