నిన్న త్రివిక్రమ్.. నేడు వక్కంతం?

నిన్న త్రివిక్రమ్.. నేడు వక్కంతం?

ఏదో ఒక హాలీవుడ్ సినిమానో.. లేదంటే మరేదైనా ఇంటర్నేషనల్ సినిమానో సైలెంటుగా కాపీ కొట్టేసి సినిమాలు తీసేస్తే ఒకప్పుడు చెల్లిపోయేంది. కానీ ఇప్పుడున్నది ఇంటర్నెట్ యుగం. సినిమా బయటికి వచ్చాక కాదు.. ఫస్ట్ లుక్కో, టీజరో చూసేసి కూడా జనాలు కాపీ క్యాట్‌లను పట్టేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలే కాదు.. ప్రపంచంలో ఏ దేశానికి చెందిన సినిమాను కాపీ కొట్టినా మూవీ లవర్స్ క్యాచ్ చేసేస్తున్నారు. త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్‌ల ‘అజ్ఞాతవాసి’ టీజర్ చూడగానే ఇది ఫ్రెంచ్ మూవీ ‘లార్గో వించ్’కు ఇది కాపీ ఏమో అని సందేహాలు మొదలయ్యాయి. తర్వాత అదే నిజమని తేలింది. దీని వల్ల త్రివిక్రమ్ ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయిందో తెలిసిందే.

ఇప్పుడు రైటర్ టర్న్డ్ డైరెక్టర్ వక్కంతం వంశీ కూడా ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అతడి డైరెక్టోరియల్ డెబ్యూ మూవీ ‘నా పేరు సూర్య’కు హాలీవుడ్ మూవీ ‘యాంట్వోన్ ఫిషర్’కు కాపీ అని అంటున్నారు. చిన్నపుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి ఎన్నో కష్టాలెదుర్కొన్న కుర్రాడు.. ఆర్మీలో చేరడం.. యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూలతో సైక్రియాట్రిస్టును కలవడం.. అతడికో గాడ్ ఫాదర్ ఉండటం.. ఇలా సాగుతుందట ఆ సినిమా.

‘నా పేరు సూర్య’ టీజర్ చూస్తే ఇది కూడా అలాంటి కథతోనే తెరకెక్కిన సినిమాలా కనిపించిందని అంటున్నారు. మరి ఈ విషయంలో పూర్తి స్పష్టత రావడానికి ఇంకొన్నాళ్లు సమయం పట్టొచ్చు. ఒకప్పుడైతే ఈ కాపీల్ని పట్టించుకునేవాళ్లు కాదు కానీ.. ప్రస్తుతం మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజవుతున్న నేపథ్యంలో హాలీవుడ్ మేకర్స్ దృష్టికి విషయం వెల్లడం పెద్ద కష్టమేమీ కాదు. ఆల్రెడీ ‘అజ్ఞాతవాసి’ లీగల్ ట్రబుల్ ఎదుర్కొన్న నేపథ్యంలో ‘నా పేరు సూర్య’ నిజంగా కాపీ అయితే ఆ చిత్ర బృందానికి తలనొప్పి తప్పదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు