కాంట్రవర్సీ ఈజ్‌ ది కింగ్‌!

కాంట్రవర్సీ ఈజ్‌ ది కింగ్‌!

కంటెంట్‌ ఈజ్‌ ది కింగ్‌ అనేది విడిచి కాంట్రవర్సీ ఈజ్‌ ది కింగ్‌ అంటూ కొత్త పాట అందుకోవాలి సినీ పరిశ్రమ. ఎందుకంటే కంటెంట్‌ వున్న సినిమాలైనా మిస్‌ఫైర్‌ అవుతాయేమో కానీ, విడుదలకి ముందు, తర్వాత కాంట్రవర్సీలు జరిగిన సినిమాలకి మాత్రం ఆదరణ బ్రహ్మాండంగా వుంటోంది. పద్మావతి చిత్రంపై జరిగిన రచ్చ ఎలాంటిదనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.

ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతున్న సమయం నుంచి విడుదల వాయిదా వేయించడం వరకు అన్నిట్లోను కాంట్రవర్సీకే పట్టం కట్టారు. దాంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంపై ఎందుకింత రచ్చ జరుగుతోందా అంటూ ప్రతి ఒక్కరూ దీనికోసం ఎదురు చూసారు. దీంతో పద్మావత్‌ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము లేపుతోంది. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోను ఈ చిత్రం విజయ దుందుభి మోగిస్తోంది.

ఇంతకుముందు తమిళ చిత్రం 'మెర్సల్‌'కి కూడా ఇలాగే పెద్ద కాంట్రవర్సీ జరిగింది. దాంతో ఆ సినిమా కోసం జనం ఎగబడ్డారు. తమిళనాడులో అతి పెద్ద విజయాన్ని ఆ చిత్రం అందుకుంది. ఒక సినిమా నిర్మాణ దశలో వుండగా కాంట్రవర్సీలు జరిగితే ఈ వైరల్‌ వరల్డ్‌లో అంతకుమించిన పబ్లిసిటీ లేదు. పద్మావత్‌ చిత్రం తలపెట్టినందుకు అప్పట్లో సంజయ్‌ లీలా భన్సాలీ కాస్త చింతించి వుండొచ్చు కానీ ఇప్పుడు దక్కుతోన్న ఆదరణ చూసి తదుపరి చేయాల్సిన కాంట్రవర్షియల్‌ సబ్జెక్ట్‌ కోసం వెతుకులాట మొదలు పెట్టి వుండొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు